బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Uncategorized

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాన్ని బయటపెట్టారు-సైబరాబాద్ సైబర్ క్రైమ్.

సెప్టెంబర్ 24 నుండి 30 వరకు సైబరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 14 సైబర్ క్రైమ్ కేసులు గుర్తించబడ్డాయి. ఈ కేసులలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 22 మందిని అరెస్ట్ చేశారు. విచారణలో దేశవ్యాప్తంగా సైబర్ నేర నెట్వర్క్ ల విస్తృతి వెలుగులోకి వచ్చింది. 22 మంది అరెస్టుల్లో 17 మంది ట్రేడింగ్ మోసాలకు సంబంధించినవారు. ఐదుగురు నిందితులు గ్యాంగ్‌గా ఏర్పడి సైబర్ నేరాలకు కుట్ర పన్నినందుకు అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకీ పంపబడ్డారు.
Abstract Sl. Modus Operandi No. of Cases No. of Arrests
1 Trading Fraud 10 17
2 Parttime Job Fraud 1 2
3 Digital Arrest Fraud 1 1
4 Investment Fraud 1 1
5 Job Fraud 1 1
TOTAL 14 22
స్వాధీనం చేసిన వస్తువులు:- మొబైల్ ఫోన్లు: 15, సిమ్ కార్డులు: 17, రీఫండ్లు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ 48 కేసుల్లో కోర్టు ద్వారా ₹ 69,19,650/- విలువైన 266 రిఫండ్ ఆర్డర్లను సాధించి బాధితులకు చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ వారపు ముఖ్యమైన కేసు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ₹1.16 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాన్ని బయటపెట్టారు మహారాష్ట్రలో ఐదుగురు అరెస్ట్. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ఒక బాధితురాలు నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా మోసపోయి మొత్తం ₹1.16 కోట్లు నష్టపోయింది. నిందితులు వాట్సాప్ ద్వారా సంప్రదించి, స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ ట్రేడింగ్, IPO అలాట్మెంట్స్, అప్‌పర్ సర్క్యూట్ షేర్లు వంటివాటిలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితురాలు డౌన్‌లోడ్ చేసిన నకిలీ యాప్‌లో మొదట చిన్న మొత్తాలను వెనక్కి ఇవ్వగా, తరువాత ₹70 కోట్లు వర్చువల్ లాభం చూపించి, పెద్ద మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి అడ్డుకున్నారు. బాధితురాలు మొత్తం ₹1.16 కోట్లు నష్టపోయింది. 15 నకిలీ లబ్ధిదారుల ఖాతాలను గుర్తించారు. ఒక ప్రధాన ఖాతా నకిలీ ఎంటర్‌ప్రైజ్ పేరుతో నడుస్తున్నట్టు బయటపడింది. ఈ ఖాతాలను మోసగాళ్లకు కమీషన్ కోసం నిందితులు అందించారు. దేశవ్యాప్తంగా 13 ఇలాంటి ఫిర్యాదులకు ఈ ఖాతాలు సంబంధమున్నట్టు తేలింది. సైబరాబాద్ పోలీసులు మహారాష్ట్రలో ఐదుగురిని అరెస్ట్ చేశారు: 1.తేజస్ రాజేంద్ర శిర్షాత్, 2.ప్రతీక్ బాబాసాహెబ్ భోస్లే, 3.నిఖిల్ గణేశ్ మోరే, 4.ఆహిత్ కుమార్, 5.నీరజ్ బాబాలు బర్మాన్. నిందితులు తమ బ్యాంక్ ఖాతాలు, గుర్తింపు పత్రాలు మోసగాళ్లకు కమీషన్ కోసం ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ లేదా అధికారికత లేని యాప్‌ల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మరాదు. ఎప్పుడూ SEBI-రిజిస్టర్ అయిన ప్లాట్‌ఫార్మ్‌లను మాత్రమే వినియోగించాలి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ ఉంటే వెంటనే www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి లేదా 1930కి కాల్ చేయండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం సైబరాబాద్ పోలీసుల అధికారిక ఛానల్స్‌ను అనుసరించండి.

పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయం