బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Uncategorized

నాలుగు వరుసల్లో విగ్రహాల శోభాయాత్ర నిమజ్జనం వేగవంతం – సివి ఆనంద్ ఐపీఎస్.

గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగుతోందని సివి ఆనంద్ ఐపీఎస్ డిజి, కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు తెలిపారు. నిమజ్జన ప్రక్రియలో పురోగతిని, పోలీసులు తీసుకున్న చర్యలను వివరించారు.
• ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1:05 గంటలకు, బాలాపూర్ గణపతి నిమజ్జనం సాయంత్రం 6:11 గంటలకు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 650కి పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయింది అని తెలిపారు.
• నగరంలో ఇంకా సుమారు 4,500 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది. సౌత్ జోన్ (ఛత్రినాక, చాంద్రాయణగుట్ట, రాచకొండ) మరియు సైబరాబాద్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఇంకా రోడ్లపై ఉన్నాయని ఏరియల్ సర్వే ద్వారా గుర్తించామని తెలిపారు.
• నాలుగు వరుసల్లో విగ్రహాల శోభాయాత్రను కొనసాగించి నిమజ్జనం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
• ఈసారి గణేశ్ నిమజ్జనానికి సాంకేతికతను విస్ర్తుతంగా వినియోగించుకున్నాము. విగ్రహాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు, గణేశ్ విగ్రహాలను జియో-ట్యాగింగ్ చేశాము. దీనివల్ల ప్రక్రియ సులభమైందని తెలిపారు.
• టీఎస్ కాప్ (TS COP) యాప్లో గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ఇన్‌స్పెక్టర్ స్థాయిలో కూడా తమ పరిధిలోని విగ్రహాల కదలికలను ట్రాక్ చేయగలుగుతున్నారు.
• మండపాల నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ప్రకారం, డీజే, బ్యాండ్ వంటివి లేకుండా చూసి వాహనాలను అనుమతిస్తున్నామని తెలిపారు.
• విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తీసుకున్న చర్యల వల్ల 10 శాతం సీసీటీవీ కెమెరాల కనెక్షన్లు తెగిపోయినాయి, వీటిలో 3 శాతము వరకు నిమజ్జనము కోసము రిపేరు చేయగలిగినారు. మరియు నిఘా కోసం డ్రోన్లు (9), హై-రైజ్ కెమెరాలను (35) ఉపయోగిస్తున్నాము.
• నిమజ్జనం వేగవంతం చేయడానికి పుషింగ్ పార్టీలను ఏర్పాటు చేశాము. హుస్సేన్ సాగర్ వద్ద 40 క్రేన్‌లు నిమజ్జనం కోసం అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు.
• జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తున్నాము.
పోలీసుల సూచనలను మండప నిర్వాహకులు మాతో సహకరిస్తూ సూచనలు పాటిస్తున్నారని, రేపు ఉదయం 8 గంటలలోపు విగ్రహాల నిమజ్జనాలు పూర్తవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు, రేపు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ సడలింపు ఉంటుందని కమిషనర్ తెలిపారు. సౌత్ జోన్ మరియు ఈస్ట్ జోన్‌లోని పెండింగ్ విగ్రహాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని వెల్లడించారు.
కమాండ్ ఆండ్ కంట్రోల్ రూము ద్వారా అన్ని శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఎప్పటి కప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమములో విబి. కమలాసన్ రెడ్డి, డైరెక్టర్ టిజిఐసిసిసి, శ్రీమతి. పుష్ప డిసిపి టిజిఐసిసిసి మరియు ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు. 

పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయం