బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్దం – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వినాయకుల నిమజ్జనాలు జరగనున్న నేపధ్యలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా సుమారు 800 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలు సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని, గణనాథుని శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను సిసి కెమెరాల ద్వారా పర్యాయవేక్షించడం జరుగుతుందని, అల్లర్లు శృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది అన్నారు. జిల్లా షి-టీం బృందాలు నిరంతరం గస్తీ కాస్తూ.ఆకతాయిలకు చెక్ పెట్టడం జరుగుతుంది అన్నారు. గణనాథుని శోభాయాత్ర ఊరేగింపులో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని, ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు నిబంధనలను పాటిస్తూ పోలీసువారి సూచనలను పాటించాలని సూచించారు. మత సాంప్రదాయాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో శోభాయాత్రను పూర్తి చేయాలని అన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని అన్నారు. శోభాయాత్రను వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమజ్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద నీళ్ళలోనికి దిగకుండా బారికెట్స్ ఏర్పాటు చేయించడం జరిగిందని, విగ్రహాలను నిమర్జనం చేయడానికి క్రేన్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రమాదవశాత్తు అనుకోని ప్రమాదం జరిగిన తక్షణం స్పందించడానికి గజ-ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సబ్-డివిజన్ల వారీగా డియస్పి లచే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు తక్షణం స్పందించి, గుంపును చెదరకొట్టడానికి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టిమ్స్ సిద్దంగా ఉంటాయన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ, మండప నిర్వాహకులు పోలీసు వారితో సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. 1. ఊరేగింపులో డి.జె. లకు అనుమతిలేదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. 2. వినాయక విగ్రహములను తీసుకొనివెళ్లే వాహనములలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, టపాకాయలు, మండే స్వభావం కలిగిన పదార్ధాలు అనగా పెట్రోలు, డీజిల్ మొదలగునవి ఉంచరాదు. 3. విగ్రహలను తీసుకొని వెళ్లే వాహనం మంచి కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలి. 4. నిమజ్జనంలో పాల్గొనే వారు ఎలాంటి మత్తు పదార్థాలు సేవించకుండా నిర్వాహకులు జాగ్రత్తపడాలి. 5. ఎలాంటి వదంతులను నమ్మకూడదు, అసత్య ప్రచారాలు చేసిన వ్యక్తుల పై డయల్ 100 ద్వారా లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి