Breaking News

హైదరాబాదు ఖైరతాబాద్ బడా గణేశ్ ను సందర్శించిన – సి.వి. ఆనంద్ ఐపీఎస్.

సి.వి. ఆనంద్ ఐపీఎస్, డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు ఖైరతాబాద్ బడా గణేశ్ ను సందర్శించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ కమిషనర్ గా గణేష్ విగ్రహము ప్రతిష్టించిన రెండవ రోజునే ఖైరతాబాద్ గణేష్ ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తాను దాదాపు 25 సంవత్సరాలుగా ప్రదలందరితో పరిచయంలో ఉన్నానని చెప్పారు. తాను డీసీపీ సెంట్రల్ జోన్‌గా,అడిషినల్ సిపి ట్రాఫిక్ గా మరియు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా ఇప్పటివరకు 11 సార్లు గణేష్ నిమజ్జన బందోబస్తులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 6, 2025న గణేష్ విగ్రహాల నిమజ్జనానికి హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపారు. ఉత్సవాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. దాదాపు 11,000 దరఖాస్తులలో, 10,900 గణేష్ మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు చేశామని. హైదరాబాద్ నగరంలో మిగిలిన సుమారు 15,000 విగ్రహాలను కూడా రికార్డుల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల బందోబస్తు చర్యలు చేపట్టడం సులభమవుతుందని తెలిపారు. ఈ ఉత్సవాల కోసం హైదరాబాద్ పోలీస్ విభాగాల నుండి దాదాపు 19,000 మంది పోలీసులు అందుబాటులో ఉంటారు. బయటి జిల్లాల నుండి అదనంగా 8,500 మంది పోలీసులు, 42 ప్లాటూన్లు, 10 సీఏపీఎఫ్ కంపెనీలు, మరియు ఆక్టోపస్ బృందాలు వస్తున్నాయి. మొత్తం సుమారు 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వివరించారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని రోజువారీగా 60 నుండి 70 వేల మంది సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరపు బోనాలు మరియు ఇతర పండుగలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నందున, ఖైరతాబాద్ గణేష్ ను సందర్శించడానికి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, కావున ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వారాంతాల్లో లక్ష నుండి రెండు లక్షల మంది భక్తులు వస్తున్నందున, ఎక్కువ మంది పోలీసులను నియమించి, గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు, భక్తులు మరియు ఉత్సవ సమితి సభ్యులు పోలీసులతో సహకరించాలని కోరారు. రాబోయే పది రోజులు వర్షాలు ఉన్నందున, బందోబస్తు విధుల్లో ఉన్న తమ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
తరువాత సి.వి. ఆనంద్ ఐపీఎస్, డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు మరియు ఇతర అధికారులు కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపానికి వెళ్లే దారులను, బారికేడింగ్ వ్యవస్థను పరిశీలించారు. గణేష్ విగ్రహాలు మూడవ రోజు నుండి నిమజ్జనానికి వస్తాయి కాబట్టి, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మరియు ఇతర నిమజ్జన పాయింట్లను కూడా పరిశీలించారు.
శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించడానికి ప్రజల సహకారం కోరుతున్నామని సి.వి. ఆనంద్ ఐపీఎస్, డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ (అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్), డి. జోయల్ డెవిస్ ఐపీఎస్ (జాయింట్ సీపీ ట్రాఫిక్), శ్రీమతి కె. అపూర్వా రావు ఐపీఎస్ (డీసీపీ ఎస్.బి.), శ్రీమతి కె. శిల్పావల్లి ఐపీఎస్ (డీసీపీ సెంట్రల్ జోన్) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *