Breaking News

బ్యాంకు లో డబ్బులు దొంగిలించిన ఐదుగురు నిందితులను అరెస్ట్ – నకరేకల్ పోలీసులు.

తేదీ 25.08.2025 మధ్యాహ్నం 02:30 గంటల సమయం లో పిర్యాది యగు మాద నాగ రాజు తండ్రి సత్తయ్య , గ్రామం నడిగూడెం, మండలం నకరేకల్ అనునతడు నకరేకల్ లోని నల్లగొండ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు నందు గోల్డ్ లోన్ క్లియర్ చేయడానికి (3) మూడు లక్షల రూపాయల నగదు ను కవరులో పెట్టుకొని బ్యాంకుకు వచ్చి ఒక చేతి లో కవర్ పట్టుకొని మరొక చేతి తో ఓచర్ వ్రాస్తుండగా గుర్తు తెలియని నలుగురు మహిళలు బ్యాంకు లోపలి వచ్చి పిర్యాది యొక్క దృష్టి మళ్ళించి వెనకాల నుండి అతని చేతిలోని కవర్ ను బ్లేడ్ తో కట్ చేసి అందులో వున్న డబ్బుల నుండి రూ. 2,50,000/-లు దొంగిలించుకొని పోయిన కేసు విషయమై నల్గొండ జిల్లా ఎస్‌.పి. శరత్ చంద్ర పవార్, IPS సూచనల మేరకు నల్లగొండ డి‌ఎస్‌పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో నకిరేకల్ ఇన్స్పెక్టర్ N.వెంకటేష్ ఆధ్వర్యంలో బి. లచ్చిరెడ్డి, ఎస్.ఐ., నకరేకల్ పోలీస్ స్టేషన్ మరియు సిబ్బంది యుక్తం గా వేర్వేరు ప్రదేశాలలో నేరస్తుల కొరకు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక బృందాలు నిర్వహించిన వాహన తనిఖీలలో భాగంగా, తేది: 28.08.2025 రాత్రి నకిరేకల్ శివారులోని NH.No. 65 రోడ్ లో గల నగేష్ హోటల్ ముందు వాహనాలను తనిఖీ చేస్తుండగా, రాత్రి సుమారు 10:00 గంటల సమయం లో ఒక ఎర్టీగా కారు లో ఏడుగురు వ్యక్తులు రాగా, వారిని ఆపి విచారించగా ఒకరికి ఒకరు పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి వారిని విచారించగా, వారు తేదీ 25.08.2025 మధ్యాహ్నం 02: 30 గంటల సమయం లో నకరేకల్ లోని నల్లగొండ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు వద్దకు ఎర్టీగా కార్ నెంబర్. AP05-CZ-2860 లో వచ్చి A-1. పురుపురెడ్డి నాగ భర్త లేట్ సత్యనారాయణ మరియు A-5. పురుపురెడ్డి మోషే తండ్రి లేట్ సత్యనారాయణ ఇద్దరు కార్ లో ఉండగా, మిగిలిన ఆడవాళ్ళు A-2. పట్నాల పొలమ్మ @ బోడి భర్త ప్రసాద్, A-3. పోరుపురెడ్డి @ పోరిపిరెడ్డి చాందిని @ సత్తెమ్మ @ సత్య @ సత్యావతి భర్త సాయిరాం, A-4. యరసాని సంధ్య భర్త గోవిందు మరియు ఒక బాలిక(JCL-1) ఒకరి తరువాత ఒకరు బ్యాంక్ లోకి వెళ్లారు, ఒక బాలుడు(JCL-2) బ్యాంక్ బయట ఉండి చుట్టూ ప్రక్కల గమనిస్తూ వుండగా, బ్యాంకు లో ఒక చేతి లో కవర్ పట్టుకొని మరొక చేతి తో ఓచర్ వ్రాస్తున్న పిర్యాది యగు మాద నాగ రాజు యొక్క దృష్టి మళ్ళించి వెనకాల నుండి అతని చేతిలోని కవర్ ను బ్లేడ్ తో కట్ చేసి అందులో వున్న డబ్బుల నుండి రూ. 2,50,000/-లు దొంగిలించుకొని పోయి, తరువాత వారందరు కార్ లో విజయవాడ వెళ్ళి ఆ రాత్రి కనకదుర్గామాత గుడిలో పడుకొని, మరునాడు విజయవాడ లోనే ఉండి, మరుసటి రోజు కోదాడ వచ్చి అక్కడ బస్ స్టాండ్ లో పడుకున్నారు. వారు మళ్ళీ ఎక్కడైనా దొంగతనం చేయాలనుకొని కోదాడ లోనే రెండు రోజులు ఉండి అక్కడి బ్యాంక్ లు మరియు షాప్ ల వద్దకు వెళ్ళగా ఎక్కడ దొంగతనం వీలుపడలేదు, ఇక్కడ అయితే సరిగా వీలుపడట్లేదు అనుకోని చిట్యాల, చౌట్టుప్పల్ ఏరియాలలో దొంగతనం చేయాలనుకొని అక్కడి నుండి నిన్న రాత్రి అందాజ 08:30 గంటల సమయములో చిట్యాల పోదాం అనుకోని వస్తుండగా రాత్రి అందాజ 10:00 గంటల సమయములో నకరేకల్ వచ్చే సరికి పోలీస్ వారు పట్టుబడి చేసినారని వారు చేసిన దొంగతనం ఒప్పుకున్నారు. నగదు రూ. 2,32,000/-, ఎర్టీగా కార్ నెంబర్. AP-05-CZ-2860,(02) రెండు నేరస్తుల సెల్ ఫోన్లు, ఒక బ్లేడ్. నల్లగొండ డి‌ఎస్‌పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో, ఇట్టి దృష్టి మళ్ళించి చేసిన దొంగతనం కేసు చేదించి నేరస్తులను పట్టుబడి చేసిన పోలీసు అధికారులు అయిన నకిరేకల్ ఇన్స్పెక్టర్ N.వెంకటేష్, ఎస్.ఐ. లు బి. లచ్చిరెడ్డి, జి. కృష్ణా చారి మరియు సిబ్బంది వై. వెంకటేశ్వర్లు-పి‌సి-3679, M శ్రీనివాస్-పి‌సి-3680, D. శ్రీకాంత్ -పిసి. 3742, వి. సురేష్-పి.సి. 1463, కె. జనార్ధన్- పి.సి. 4071, బి. మధుకర్- పి.సి.3658, జె. లక్ష్మి- WPC-4031 లను జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్, ఐ.పి.ఎస్. అభినందించారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *