బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

నిద్రిస్తున్న వ్యక్తి తలపై బండరాయి పడేసి, చంపిన నిందితున్ని అరెస్టు – డిఎస్పీ నల్గొండ.

నల్లగొండ పట్టణంలో తేదీ 28.07.2025 ఉదయం 6 గంటల సమయంలో స్థానికుల సమాచారం మేరకు, ప్రతిక్ రెడ్డి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద నిద్రిస్తున్న చింతకింది రమేష్‌ తండ్రి మల్లయ్య, వయసు 40,R/o. వడ్డేపల్లి, నాంపల్లి ను బండరాయితో తల పై మోది చంపిన విషయంలో రమేష్ బావ భూష్పాక వెంకటయ్య పిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. నల్లగొండ జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశానుసారం నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా జరిగిన విషయంపై, నేరస్తుని గుర్తించుటకు నియమించడం జరిగింది. ఈ క్రమంలో clues టీమ్స్ సిబ్బంది సాయంతో నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ లభించిన సమాచారం మరియు ఆధారాలతో, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లతో నేరస్తుడిని గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకు రెహమాన్ బాగ్ లోని ధమాకా బజార్ దగ్గర నిద్రిస్తున్న నిందితుని వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పట్టుబడి చేసి విచారించగా, నేరస్తుడు తాను చేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది. కర్ణాటక రాష్ట్రము కి చెందిన షేక్ సిరాజ్ నెల రోజుల క్రితం ఇతనికి తెలిసిన హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర లారీ క్లీనర్ గా పని చేస్తూన్నాడు. ఒక రోజు లోడ్ తీస్కొని నల్గొండ నుండి పోతున్న సమయం లో డ్రైవర్ తో గొడవపడగా, డ్రైవర్ లారీ నుండి దింపేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నల్గొండ పట్టణం లో ఉంటూ, అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఐదు రూపాయల భోజనం చేస్తూ, చుట్టుపక్కల అడుక్కుంటూ క్యాంటీన్ వద్దే పడుకున్నాడు. ఇదే క్రమంలో తేదీ 27.08.25 రాత్రి 10 గంటల సమయంలో ఇతను పడుకునేటటువంటి స్థలము లో ఇతని పట్టా తో నిద్రిస్తున్న చింతకింది రమేష్‌ని, తను రోజు నిద్రించే ప్లేస్‌లో ఎందుకు పడుకున్నావు అని అడగగా, మృతుడు రమేష్ తాగిన మైకంలో ఈ ప్లేస్ నీ అయ్యదా? నువ్వు ఎవడివి నన్ను అడిగేది అంటూ గొడవకు దిగి చేతి తో కొట్టి గొంతు పట్టుకొని చంపుతా అని నెట్టేసి బెదిరించగా, అక్కడి నుండి వెళ్ళిపోయి, దీంతో తను రెగ్యులర్ గా పడుకునే స్థలం లో పడుకుని, తననే తిట్టి, కొట్టినందుకు అవమానంగా భావించి కక్ష్య పెంచుకొని ఎలాగైనా అతనిని ఏదో ఒకటి చేయాలని, ఒక గంట తర్వాత మృతుడి వద్దకు వచ్చి, నిద్రిస్తున్నది గమనించి పక్కనే ఉన్న మొలదేలిన ఒక గ్రానైట్ రాయిని తీస్కొని రెండు చేతులతో మృతుడి తలపై బలంగా కొట్టి రాయిని దొరకకుండా కాలేజీ గోడ వెనక విసిరేసి అక్కడ నుండి పారిపోయినాను అని తెలియజేస్తూ, నేరం ఒప్పుకోగా,అతడు నేరానికి ఉపయోగించిన బండ రాయిని చూపించగా, అట్టి రాయి స్వాధీనం చేసుకొని అతడిని కోర్టు ముందు హాజరుపరచనైనది. 1.నేరస్తుడు నేరం కు ఉపయోగించిన బండ రాయి,2.రక్తపు మరకలు కలిగిన నేరస్తుని ఒంటి మీది దుస్తులు. ఇట్టి కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ వెంటనే స్పందించి సీరియస్గా తీసుకొని డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బృందాలతో కేవలం 24 గంటలలోపు చేదించి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్సై వెంకట్ నారాయణ, ASI వెంకట్ యాదవ్,సిబ్బంది రబ్బాని, షకీల్, శ్రీకాంత్, శంకర్, జానకి రాములు, సైదులు ఎస్పీ అభినందించడం జరిగింది.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి