బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

బ్యాంకుల భద్రతా చర్యలపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 100 మంది బ్యాంకర్లతో సమావేశం.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్లతో బ్యాంకుల భద్రత పై సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. బ్యాంక్ లలో భద్రత, సైబర్ నేరాలలో రీఫండ్ ప్రక్రియలో స్పందించవలసిన తీరు, సైబర్ మోసగాళ్ల ఖాతాల ఓపెయింగ్ లో తీసుకోవలసిన చర్యల గురించి బ్యాంకర్స్ తో చర్చించడం జరిగింది. ప్రతి బ్యాంకులో ప్రధానంగా సిసిటీవి కెమెరాలు పనిచేసే విధంగా చూసుకోవాలని, సిసి కెమెరాలు సెన్సార్ మోషన్ ఉండే విధంగా చూడాలని, సెక్యూరిటీ అలారమ్స్ పనిచేస్తున్నాయ లేదా అని చెక్ చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఆయుధాలు కలిగిన సిబ్బందిని సెక్యూరిటీ గా నియమించుకోవాలని అన్నారు. బ్యాంక్ నుండి పోలీసు స్టేషన్ ఎంత దూరంలో ఉందని, పోలీసు స్టేషన్, అధికారుల ఫోన్ నెంబర్స్ తదితర వివరాలను సిబ్బంది తెలుసుకొని ఉండాలని అన్నారు. తరుచూ సెక్యూరిటీ అడిట్స్ జరిగే విధంగా చూడాలని, ఆధునిక సాంకేతికతను కలిగిన సెన్సార్ లను బ్యాంక్ లలో అమార్చాలని, విలువైన సమాచారాన్ని అందరితో షేర్ చేయవద్దని సూచించారు. అత్యవసర సమయాలలో డైల్ 100 చేయాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి, బ్యాంక్ అధికారులు OTP లు అడగరని, అనవసర లింక్స్ షేర్ చేయరని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త అకౌంటు ఓపెనింగ్ కోసం వచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్స్, ఆధార్ తదితర వివరాలను అడిగిన తర్వాతనే ఖాతాను ఓపెన్ చేయాలని సైబర్ నేరగాళ్లు తప్పుడు ఫోన్ నెంబర్స్ తో అమాయక ప్రజల పేర్లతో ఖాతాలను తెరిచి, వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. సైబర్ నేరాలలో బాధితులకు అంధించే రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రీఫండ్ ప్రక్రియలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. వివిధ రకాల బ్యాంక్, ATM దొంగతనాలు, సైబర్ నేరాలకు సంబంధించి కేసు స్టడీ లను చెపుతూ.అప్రమత్తంగా ఉండాలనై అదే విధంగా ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ మోసాల గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ మీటింగ్ నందు డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, వివిధ బ్యాంక్ లకు చెందన సుమారు 100 మంది మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి