Breaking News

నాలుగు ముఠాలు దొంగల ముఠాలలో మొత్తం 16 మంది సభ్యులు అరెస్ట్ – జిల్లా యస్పీ.

గత కొంత కాలంగా జిల్లా లో మేకలు మరియు గొర్రెలు దొంగతనం జరుగుతున్న నేపద్యంలో జిల్లా SP ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులపై నిఘా ఉంచి పట్టుబడాలని ఆదేశించగా తేదీ 25-08-2025న సాయంత్రం సుమారు 18:00 గంటల ప్రాంతంలో శాలిగౌరారం పోలీస్ వారు బైరవోనిబండ X రోడ్ వద్ద వాహన తనిఖీ చేపడుతున్న సమయంలో వారిని చూసి ఒక షిఫ్ట్ డిజైర్ కారు AP 09 BQ 3128 వాహనం వారి నుండి తప్పించుకొని పోవడానికి ప్రయత్నించగా వెంటనే శాలిగౌరారం పోలీస్ వారు అట్టి వాహనాన్ని పట్టుబడించి అందులో (03) మగవారు, (01) మహిళా ఉన్నారు. వారిని మా వద్ద ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ తో చెక్ చేయగా వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలింది. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు 1) సంపంగి వెంకటేష్ 2) వెంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 3) సంపంగి శారద 4) దాసర్ల వినోద్ కుమార్ @ కోటి వీరి పైన గతంలో నల్గొండ రూరల్ పి‌ఎస్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్పల్లి, నల్గొండ 2 టౌన్, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పి‌ఎస్ లలో మేకల దొంగతనాల నేరాలలో నిందితులు. వీరు గతంలో జైలుకు వెళ్ళినా బైలు పై వచ్చిన ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి నేరాలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారంగా వీరికీ పరిచయం ఉన్న వారందరూ కలిసి నాలుగు గ్యాంగ్ లుగా ఏర్పడి ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లలో వచ్చి పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రి సమయాలలో ఖరీదైన కార్లలో వచ్చి మేకలను కార్లలో వేసుకొని మేకల దొంగతనాలకు పాల్పడుతుంటారు. పట్టుబడిన నేరస్థులు చెప్పిన వివరాల ప్రకారంగా నల్గొండ జిల్లాలో మొత్తం 15 చోట్ల మరియు రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకల దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. వీరు దొంగలించిన మేకలను సంతలలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారు. ఇట్టి 26 నేరాలలో సంబంధించి 200 లకు పైగా మేకలను రెండు లక్షల నలబై ఆరు వేల రూపాయల నగదు, 2 లక్ష డెబ్బైయిదు వేల రూపాయల విలువ గల 22 గొర్రెలు మరియు 47 లక్షల విలువ గల 8 కార్లు సీజ్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. 1) సంపంగి వెంకటేష్ 2) వెంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 3) సంపంగి శారద 1) వారికుప్పల రవి @ చింటూ 2) గండికోట శివ కుమార్ 3) అమ్ములూరి విజయ్ 4) వరికుప్పల రాజు 5) లింగాల అశోక్ 6) ఉండం కళ్యాణి 7) కొటేశ్ @ లడ్డు 8) కనుకుల బేబీ కలిసి రెండు గ్యాంగ్ ఏర్పడి మునుగోడు, గుర్రంపుడు, నిద్మనుర్, దిండి, కేతేపల్లి, వాడపల్లి, మర్రిగూడ, చింతపల్లి, మల్లెపల్లి, యాచారం, బాలానగర్, సిద్దాపూర్, కడ్తాల్, కొత్తూర్ పోలీస్ స్టేషన్ ల పరిదిలో,ఇంకో గ్యాంగ్ వినోద్, ప్రసాద్, సహదేవ్, కలసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి చిట్యాల, భవనగిరి మండలాలలో అన్నీ కలిపి 26 దొంగతనాలలో దాదాపు 200 మేకలను దొంగతనం చేసినారు. మూడవ ముఠా 1) వల్లెపు ప్రసాద్ తండ్రి: యాదగిరి, 2) మద్యాల సహదేవ్ తండ్రి: వెంకటయ్య, 1.కోడిసే వంశీ కృష్ణ తండ్రి వెంకన్న, 2. కంపాటి హుస్సేన్ తండ్రి వెంకన్న, 3. కంపాటి అజయ్ కుమార్ తండ్రి లింగయ్య, 4. మట్టి సురేష్ తండ్రి వెంకన్న ఇట్టి ముఠా సభ్యులను నల్గొండ డి.ఎస్.పి. కె.శివరాం రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, నల్గొండ సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ ఎమ్.జితేంధర్ రెడ్డి, యం.నాగభూషణ్, కె.కొండల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శాలిగౌరారం,నార్కట్ పల్లి సి‌ఐ‌ కె.నాగరాజు,యస్.ఐలు శివ కుమార్,విజయ్ కుమార్,రవి,రవి కుమార్, సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, వహీద్ పాషా,సూఫీయాన్ అలీ,రామ్ ప్రసాద్,నాగరాజు, సి‌సి‌ఎస్, కానిస్టేబుల్ అశ్రార్,మహేశ్,వెంకట్ రామ్ ,సాయి మరియు ఇతర సి‌సి‌ఎస్ సిబ్బందిని జిల్లా ఎప్.పి. ప్రత్యేకంగా అభినందించి ప్రశంశా పత్రాలు అందజేసి రివార్డును ప్రకటించారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *