
నల్లగొండ పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతుల వివరాలు గురించి సిఐ రాజశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకుని, రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి, సిబ్బందికి కేటాయించిన కిట్లను తనిఖీ చేయడం జరిగింది. అనంతరం, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ క్రైమ్ రికార్డ్, జనరల్ రికార్డ్స్ లు తనిఖీ చేసి, మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా, వారి పట్ల తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. స్టేషన్ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్, పెట్రో కార్ డ్యూటీ లో ఉన్నప్పుడు 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ పెట్రోలింగ్ సమయంలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నేర నియంత్రణ, దొంగతనాల నివారానికి స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి, సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సిబ్బంది పని చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి, పిడియస్ రైస్ అక్రమ రవాణా, జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి, గంజాయి తాగే వారిని, వారికి సరఫరా చేసే వారిని గుర్తించి, కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, యస్.బి సీఐ రాము, యస్ఐలు గోపాల్ రావు, సైదులు, సతీష్, మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

