బ్రేకింగ్ న్యూస్
పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయం.. ఐదుగురు అరెస్ట్గోషామహల్‌లో జూదం, హుక్కా దందాపై పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్ఖైదీల సంస్కరణలు, పునరావాసానికి ప్రాధాన్యతనిస్తూ SICAలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌లో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుహైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం
Uncategorized

జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పండుగను సుఖసంతోషాలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఎస్పీ అన్నారు. ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. జిల్లాకు భారీ వర్షా సూచన ఉండటంతో, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రమాద కారణాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, జలాశయాలు చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని, పొంగి పొర్లుతున్న వాగులను దాటడానికి ప్రయత్నించకూడదన్నారు. జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా సూచించారు. జిల్లాకు భారీ వర్షాల దృష్ట్యా పోలీసు అధికారులు, సిబ్బంది 24*7 హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడైనా ప్రమాద అంచున ఉన్న చెరువులు కుంటలు, వాగులు, వంతెనలు గుర్తించినట్లయితే, వాటిని చూడటానికి వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేయాలని, జిల్లా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించి, తగిన బందో బస్త్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆనకట్టలు, వంతెనలు దెబ్బతిన్నట్లయితే, సంబంధిత ఆర్&బీ, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు.
. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
• అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.
• ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదు.
• రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి.
• విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు.
• నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు.
• వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదు.
• పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్