Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం

చత్తీస్ గడ్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తు న్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి.

ఈ క్రమంలోనే మావోయిస్టు ల సొరంగం బయటపడిం ది. తాళిపేరు నది సమీపం లో భారీ బంకర్‌ను గుర్తిం చాయి భద్రతా బలగాలు. సొరంగంలో సకల వస తులు ఏర్పాటు చేసుకు న్నారు మావోయిస్టులు.

దేశవాళి రాకెట్‌ లాంచర్లు తయారు చేసే ఫౌండ్రీ మిషన్‌, పెద్దఎత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్‌ లైన్‌ నిర్మించే సిల్వర్‌ వైర్‌, ఆయుధాలను గుర్తించారు.

బాంబులను మావోయి స్టులు ఈ సొరంగంలోనే తయారు చేసుకుంటు న్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. తుమిరెల్లి ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ భారీ సొరంగాన్ని గుర్తించారు.

గంజాయి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్

ఈ చర్యతో మావోయిస్టు లకు కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయి స్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్నారు.

ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు చంపేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *