
• జగ్నికా రాత్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పికెట్స్ ఏర్పాటు.
• మధ్య రాత్రి సంగారెడ్డి పట్టణంలో పలు ప్రాంతాలను సందర్శించి, ప్రజలతో మాట్లాడిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.,జగ్నికా రాత్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసిన పికెట్స్, బీట్ లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్. మధ్య రాత్రి సర్ప్రైజ్ చెక్ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించిన జిల్లా ఎస్పీ, ముస్లిం సోదారులతో మాట్లాడి, వారి ఆచార్య సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. అన్ని మతాలకు చెందిన పండగలను కలిసి జరుపుకోవాలని, ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించి, మత సామరస్యాన్ని చాటాలని ఎస్పీ సూచించారు. అనంతరం బీట్స్ పికెట్స్ ను చెక్ చేస్తూ. విధి నిర్వాహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి శాంతి భద్రతల సమస్యల తలెత్తడానికి అవకాశం ఉన్న వెంటనే సంభందిత అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తూ., త్వరగా స్పందించడం ద్వారా సమస్యను జటిలంకాకుండా నివారించవచ్చు అన్నారు. సంఘవిద్రోహ శక్తులు ఎవరైన జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.