
బాలల అక్రమ రవాణా నిర్మూలనలో డ్రైవర్ల పాత్ర కీలకమని మహబూబాద్ జిల్లా షీ టీమ్స్ ఎస్ఐ సునంద మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డాక్టర్ నాగవాణి అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ముదిరాజ్ భవన్ నందు FMM సాంఘిక సేవా సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన మానవ అక్రమ రవాణా నిర్మూలనలో డ్రైవర్ల పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ నాగమణి హాజరై మాట్లాడుతూ 18 సంవత్సరాలు లోపు పిల్లల పట్ల అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని పిల్లలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారని ఇలా హింసకు గురైన పిల్లలు, బాధితులుగా మారిన పిల్లలు సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోతే అక్రమ రవాణాకు గురై అవకాశాలు ఉన్నాయని మరి ముఖ్యంగా బాలల అక్రమ రవాణాకు అనేక మార్గాలు అక్రమ రవాణా దారులు ఎంచుకుంటున్నారని దీనికి ముఖ్యంగా బాధితులను తరలించడానికి అక్రమ రవాణా జరపడానికి ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అయితే నిరంతరము రహదారుల్లో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు లారీ మరియు బస్ డ్రైవర్లు రవాణా వ్యవస్థలో ఉంటున్నారు కాబట్టి ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా మహిళలని, బాలలని అక్రమంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తున్నట్లయితే దానిపైన నిఘా ఉంచాలని అట్టి సమాచారాన్ని తెలిస్తే వెంటనే పోలీస్ 100 లేదా చైల్డ్ లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమం నందు హాజరైన షీ టీమ్స్ ఎస్సై సునంద మాట్లాడుతూ మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశానుసారంగా
ఎఫ్ ఎం ఎం సాంఘిక సేవా సంస్థ వారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల పట్ల జరుగుతున్న నేరాలలో కొంతమంది డ్రైవర్లు కూడా ఉంటున్నారని కాబట్టి తెలిసి ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అవసరమని తెలిపారు. అయితే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు అత్యధికంగా గంజాయికి మరియు ఆల్కహాల్ కు అలవాటు పడడం వలన ఇటువంటి నేరాలు అత్యధికంగా చేయడం జరుగుతుందని కాబట్టి డ్రైవర్లు మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు అంతేకాకుండా మీ మీద నమ్మకం తోటి పిల్లల్ని గాని, మహిళలు గాని ఆటోలను ఆశ్రయిస్తారని కాబట్టి సురక్షితంగా ప్రయాణికులను గమ్యం చేర్చడమే మీ బాధ్యతను తెలిపారు. ఎవరైనా పిల్లల్ని వేధింపులకు గురిచేసిన ఇబ్బందుల గురిచేసిన వెంటనే షీ టీమ్స్ నెంబర్ 8712656935 మరియు డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి సమాచారం అందించాలని కోరారు. బాలల పరిరక్షించడానికి పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ డేవిడ్, ఎఫ్ ఎం ఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎర్ర. శ్రీకాంత్, ఫైనాన్స్ మేనేజర్ అజయ్ కుమార్, ఫీల్డ్ కోఆర్డినేటర్లు శిరీష మరియు సమరారెడ్డి,ఆటో యూనియన్ అధ్యక్షులు వీరన్న,పోలీస్ సిబ్బంది సుప్రజ, అరుణ, పార్వతి ,రమేష్ తదితరులతో పాటు ఆయా ప్రాంతాల నుండి సుమారు 60 మంది డ్రైవర్లు పాల్గొనడం జరిగింది.
