పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభిందనీయం .
పోలీసు శాఖ తరుపున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్* ..
రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆయన సతీమణి పూజ, మహిళా పోలీస్ అధికారుల తో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో మహిళా అధికారులు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్ననందుకు ఎంతో గర్వకారణం అన్నారు.పోలీస్ శాఖ తరుపున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ సబిత, మహిళా ఎస్ఐలు మమత, శ్రావణి, విజయబాయి,మరియు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.