శనగపురం రోడ్డులోని బాలాజీ గార్డెన్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తో అనుమానాస్పదంగా పారిపోతుండగా అతనిని పట్టుకొని ఎందుకు పారిపోతున్నావని అడగగా అతను భయపడుతూ సరియైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే అతనిని విచారించగా అతను సూరత్ లో కూలి పనులు చేయగా వచ్చే డబ్బులు సరిపోక పోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిస్సా నుండి గోపాల్ అనే వ్యక్తి వద్ద నుండి తక్కువ ధరకు 10.102 కేజీ ల గంజాయిని కొని దానిని సూరత్ లో అధిక ధరకు అమ్ముటకు విజయవాడ మీదుగా వెళుతుండగా మహబూబాబాద్ వద్ద ట్రైన్ లో పోలీసులు తనిఖీ చేయుచున్నారని భయపడి మహబూబాబాద్ లో ట్రైన్ దిగి తొర్రూర్ మీదుగా వరంగల్ వెళ్ళుటకు గుర్తు తెలియని ఆటో ఎక్కగా బాలాజీ గార్డెన్ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు తనకి చేయుచున్నారని ఆటో దిగి పారిపోయే ప్రయత్నం చేయగా నిందితుడిని పట్టుకుని రూరల్ పిఎస్ కు తీసుకుని వచ్చి ఏఎస్ఐ జాకీర్ నిందితునిపై కేసు నమోదు చేసారు. నిందితుని వద్దనుండి 10 కేజీల 102 గ్రాముల గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ స్వాధీన పరచుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న రూరల్ సీఐ పి. సర్వయ్య ని, రూరల్ ఎస్ఐ దీపిక మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినారు.
