బ్రేకింగ్ న్యూస్
మహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Telangana

జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ప్రతిభ.. 16 పతకాలతో సత్తా చాటిన అధికారులు, సిబ్బంది

జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ప్రతిభ.. 16 పతకాలతో సత్తా చాటిన అధికారులు, సిబ్బంది

మహబూబాబాద్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పీటీసీ మామ్నూర్‌లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన భద్రాద్రి జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది విశేష ప్రతిభ కనబర్చి మొత్తం 16 పతకాలు సాధించారు. ఈ విజయంతో జిల్లాకు కీర్తి తీసుకొచ్చిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించారు.

వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తరఫున ఓవర్ ఆల్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించిన డీఎస్పీ శ్రీనివాస్, అలాగే ప్రత్యేక బాంబు స్క్వాడ్ కోచ్‌గా వ్యవహరించిన అంజయ్యలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

పోలీస్ డ్యూటీ మీట్‌లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది పలు సాంకేతిక, దర్యాప్తు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కంప్యూటర్, ఆఫీస్ ఆటోమేషన్, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో ప్రతిభ చాటారు.

స్వర్ణ పతకాలు ఎస్‌ఐ సి.హెచ్. అరుణ్ కుమార్ (ప్రోగ్రామింగ్ ఎబిలిటీ), కానిస్టేబుల్ బి. రామయ్య (బాంబు స్క్వాడ్ యాంటీ సబోటేజ్ చెక్–రూమ్ సెర్చ్), డాగ్ స్క్వాడ్ విభాగంలో కె. ఈశ్వర్ (రుద్ర) మరియు సి.హెచ్. రాకేష్ (లూసీ) సాధించారు.

మహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశం

రజత పతకాలు కె. మధు (పోలీస్ పోర్ట్రెయిట్), పి. సుమన్ (కంప్యూటర్ అవేర్‌నెస్), ఎండీ. అబ్దుల్ ఖదీర్ (ఆఫీస్ ఆటోమేషన్), ఎన్. చిరంజీవి, బి. సాయి కుమార్ (పవర్‌పాయింట్ ప్రజెంటేషన్), కె. కుశల్ కుమార్ (పోలీస్ వీడియోగ్రఫీ), జి. అశోక్ (బాంబు స్క్వాడ్–రూమ్ సెర్చ్) అందుకున్నారు.

కాంస్య పతకాలు ఎస్. విఠల్ (లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్), ఇన్‌స్పెక్టర్ బి. శంకర్ నాయక్ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ లాస్), ఎండీ. అబ్దుల్ ఖదీర్ (ప్రోగ్రామింగ్ ఎబిలిటీ), బి. రామయ్య (బాంబు స్క్వాడ్–వెహికల్ సెర్చ్), ఎ. మహేష్ (గ్రౌండ్ సెర్చ్/బాంబు స్క్వాడ్), ఎ. హరీష్ కుమార్–చార్లీ (డాగ్ స్క్వాడ్ ట్రాకర్) సాధించి జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు.

పోలీస్ డ్యూటీ మీట్‌లో సాధించిన ఈ విజయాలు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలోని సిబ్బంది నైపుణ్యం, క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రతిభకు నిదర్శనమని ఎస్పీ డాక్టర్ శబరీష్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని విజేతలకు సూచించారు. అలాగే పతక విజేతలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ వారి సేవలను కొనియాడారు.