బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

మాదకద్రవ్యాల అవగాహన వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

జిల్లా ప్రతినిధి: తెలంగాణ ఈగల్ (EAGLE) టీమ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదకద్రవ్యాల అవగాహన వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఎస్పీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు, ఇతరులను కూడా వాటి ప్రమాదాలపై అప్రమత్తం చేయాలని సూచించారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.

జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.