బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

మహబూబాబాద్ జిల్లాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు.. గుడుంబా, నకిలీ విత్తనాల స్వాధీనం

మహబూబాబాద్ జిల్లాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు.. గుడుంబా, నకిలీ విత్తనాల స్వాధీనం

మహబూబాబాద్: జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత, సంక్షేమం మరియు గ్రామీణ ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.

గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్ధారం గ్రామంలో గార్ల–బయ్యారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 60 వాహనాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టారు.

అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత, గంజా వల్ల కలిగే అనర్థాలు, గంజా రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం, గ్రామ భద్రతలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఇదే క్రమంలో మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండేపూడి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో నకిలీ విత్తనాల విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరిపెడ సీఐ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఆరుగురు వ్యక్తుల వద్ద నుంచి మొత్తం 12 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో నకిలీ విత్తనాల వల్ల పంటలకు కలిగే నష్టాలు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే బిల్లుతో విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యం, రైతుల ప్రయోజనాలు, గ్రామాల భద్రతకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు, గంజా, గుడుంబా లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు.