బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

NEET-UG–2026 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్

NEET-UG–2026 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, జూన్ 22: నీట్-యూజీ–2026 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల ప్రవేశ విధానం, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, అలాగే కేంద్ర పరిసర ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలను ఎస్పీ సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలని సూచించారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

అభ్యర్థులు పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. పరీక్షల నిర్వహణలో క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ తరఫున NEET-UG–2026 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.