బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

NEET (UG)-2026 రీ-ఎగ్జామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

NEET (UG)-2026 రీ-ఎగ్జామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ, జూన్ 21: జిల్లాలో నిర్వహిస్తున్న NEET (UG)-2026 రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా పరీక్షల నిర్వహణను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. నల్గొండ పట్టణంలోని ఎన్.జీ. కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా నిలబడకూడదని, అనవసర రద్దీ సృష్టించవద్దని సూచించారు.

పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు, పరీక్షా సామగ్రి కేంద్రాల నుంచి స్ట్రాంగ్‌రూమ్‌కు భద్రంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పరీక్షల పారదర్శకత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్షల విజయవంతమైన నిర్వహణకు అభ్యర్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.