బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Hyderabad

రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన పసికందును సీపీఆర్‌తో బ్రతికించిన రాజేంద్రనగర్ పోలీస్ బృందం

రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన పసికందును సీపీఆర్‌తో బ్రతికించిన రాజేంద్రనగర్ పోలీస్ బృందం

రాజేంద్రనగర్ జోన్ పోలీసుల సమయస్ఫూర్తి, మానవత్వంతో వ్యవహరించిన తీరుతో రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన ఏడాది పసికందు ప్రాణాలు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుని సీపీఆర్ (CPR) అందించడం ద్వారా బాలుడిని కాపాడారు.

జూన్ 18 రాత్రి డీసీపీ ఎస్. శ్రీనివాస్ తన నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బందితో కలిసి పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న MH14JR 9028 నంబర్ గల కారు శంషాబాద్–ఆరాంఘర్ మార్గంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే డీసీపీ, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఉన్న ఏడాది బాలుడు శ్వాస తీసుకోకపోవడంతో పాటు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉండగా, డీసీపీ సూచనల మేరకు పోలీసులు వెంటనే బాలుడికి సీపీఆర్ అందించారు.

సిబ్బంది నిరంతర ప్రయత్నాల ఫలితంగా కొద్దిసేపటికే బాలుడు స్పృహలోకి వచ్చి ఏడవడం ప్రారంభించాడు. అనంతరం బాలుడితో పాటు ప్రమాదంలో గాయపడిన వారందరినీ మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’

సమయానికి స్పందించి తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన డీసీపీ ఎస్. శ్రీనివాస్, పోలీసు సిబ్బందికి బాధిత కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. తమకు దేవుడిలా అండగా నిలిచారని భావోద్వేగంతో పేర్కొంది.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో విశేష సేవలందించిన కార్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది పీసీ సిహెచ్. మహేష్, పీసీ ప్రదీప్, పీసీ ఎన్. వెంకటేష్, పీసీ పవన్‌లను డీసీపీ ఎస్. శ్రీనివాస్‌తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.