బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: తండ్రికి 4 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: తండ్రికి 4 సంవత్సరాల జైలు శిక్ష

సిరిసిల్ల, జూన్ 18: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రికి 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ Mahesh B. Githe తెలిపారు.

జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ పోక్సో కేసులో, మైనర్ బాలికను తండ్రి లైంగిక వేధింపులకు గురిచేయడంతో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు సిబ్బంది ఎనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడి నేరం రుజువైందని నిర్ధారించి 4 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరం చేసిన వారు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పోలీసు, ప్రాసిక్యూషన్ విభాగాల సమన్వయంతో న్యాయపరమైన విచారణను పకడ్బందీగా నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేసు దర్యాప్తు, కోర్టు విచారణలో సమర్థవంతంగా పనిచేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.