గడిచిన రెండు నెలల్లో 22 కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు.
నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను,కోర్టు కానిస్టేబుళ్లను అభినందించి ప్రశంసా పత్రాలు,ప్రోత్సాహకాలు అందజేసిన ఎస్పీ.
కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం,శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కేసులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షల పడేలా కృషి చేసిన పీపీ లను ,కోర్టు కానిస్టేబుళ్లను అభినదించి ప్రశంస పత్రాలు,ప్రోత్సాహకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లది కీలకపాత్రని, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయoతో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా పని చేయటం అభినదనియని అన్నారు. పోలీస్ ఆదికారులు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పోక్సో,హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు.గడిచిన రెండు నెలల్లో 22 కేసుల్లో నిందితులకు జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు.
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన గంజాయి కేసులో నిందుతులకు 05 సంవత్సరాలు జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు.
22 కేసుల్లో నిదితులకు శిక్షలు పడేవిధంగా కృషి చేసిన పీపీలు, లక్ష్మీ ప్రసాద్ Addl PP 1Addl. Dist and sessions court siricilla and ASJ కోర్టు సిరిసిల్ల, శ్రీనివాస్ Addl.PP Prl.Dist and sessions court and POCSO court- siricilla,లక్ష్మణ్ Addl.PP ఏఎస్జే కోర్టు వేములవాడ,సందీప్ APP PDM సిరిసిల్లా ,సతీష్ APP ADM కోర్టు సిరిసిల్ల,విక్రాంత్ APP JFCM వేములవాడ,మరియు అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లను అభినందించి ప్రసంశ పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, cms ఎస్.ఐ లు శ్రవణ్ యాదవ్, రవీంద్రనాయుడు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.