బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

సిరిసిల్లలో నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్.. 20 వాహనాలకు జరిమానాలు

సిరిసిల్లలో నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్.. 20 వాహనాలకు జరిమానాలు

సిరిసిల్ల: వాహనాల నంబర్ ప్లేట్ల తొలగింపు, నంబర్ ప్లేట్ల మార్ఫింగ్ వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు సిరిసిల్ల పట్టణ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 20 వాహనాలను గుర్తించారు.

ఈ సందర్భంగా ఆయా వాహన యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు, వారి ఆధ్వర్యంలోనే సరైన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

వాహనాలకు నంబర్ ప్లేట్లు తొలగించడం, నంబర్లు స్పష్టంగా కనిపించకుండా మార్పులు చేయడం చట్టవిరుద్ధమని సీఐ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రతి వాహనదారుడు తన వాహనానికి నంబర్ ప్లేట్‌ను స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సరైన నంబర్ ప్లేట్లు ఉండటం వల్ల దొంగిలించబడిన వాహనాలను గుర్తించడం, నేరాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

నంబర్ ప్లేట్ లేకుండా, నంబర్ ప్లేట్‌కు అడ్డుగా వస్తువులు అమర్చడం, నంబర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించకుండా వాహనాలు నడపడం వంటి చర్యలు తీవ్ర నేరాలుగా పరిగణించబడతాయని పేర్కొన్నారు. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే చీటింగ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.