Breaking News

బక్రీద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. టోలిచౌకి-రేతిబౌలి మార్గంలో భారీ రద్దీకి అవకాశం

బక్రీద్ పండుగ-2026 సందర్భంగా మేకలు, గొర్రెల విక్రయాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని టోలిచౌకి – నానల్ నగర్ – రేతిబౌలి మార్గంలో భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 27, 28 మే 2026 తేదీలలో సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. టోలిచౌకి నుంచి రేతిబౌలి, అత్తాపూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారులపై వాహనాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. రాయదుర్గం, గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలను ఫిల్మ్‌నగర్, బృందావన్ కాలనీ మార్గాల వైపు మళ్లించనుండగా, లక్డీకాపూల్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలను మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ మార్గం ద్వారా దారి మళ్లించనున్నారు. మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు నానల్‌నగర్, లంగర్‌హౌస్, నార్సింగి మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాత్రి వేళల్లో మెహదీపట్నం-టోలిచౌకి మార్గాన్ని నివారించి ORR ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసర సహాయం కోసం 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని, తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని అధికారులు కోరారు.

బక్రీద్ వేళ గొర్రెలు, మేకల వ్యాపారులకు హెచ్చరిక.. ఫేక్ ఫోన్‌పే యాప్‌లతో మోసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *