బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Hyderabad

భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం.. ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్‌ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం.. ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్‌ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్

పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు యాప్ ‘ఏఐ కాప్‌రైట‌ర్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వినూత్న యాప్‌ను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆవిష్కరించి, దాని పనితీరును పరిశీలించారు.

నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, అనువదించుకోగలుగుతారు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ తెలియని వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల ప్రజలు, పర్యాటకులు ఎదుర్కొంటున్న భాషా సమస్యలకు ఈ యాప్ చెక్ పెట్టనుంది.

ఈ యాప్ 10కి పైగా భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి భాషల్లో మాట్లాడిన ఫిర్యాదులను వెంటనే రాతపూర్వక రూపంలోకి మార్చి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదిస్తుంది. గంటల సమయం పట్టే ఫిర్యాదు నమోదు ప్రక్రియను కేవలం సెకన్లలో పూర్తి చేసేలా రూపొందించారు.

ఫిర్యాదు నమోదు చేసిన అధికారి వివరాలు, సమయం వంటి సమాచారం ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో భద్రపరచబడటంతో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు. బాధితుడు, నిందితుడు, సాక్షులు మాట్లాడే విషయాలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేసే మల్టీ-పార్టీ లేబులింగ్ ఫీచర్ కూడా ఈ యాప్‌లో ఉంది.

హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

ఈ యాప్‌ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ అభివృద్ధి చేసింది.

“హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ. ఇక్కడ వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. భాష తెలియక ఫిర్యాదు చేయడంలో ఎదురయ్యే సమస్యలకు ఈ యాప్ పూర్తి పరిష్కారం చూపనుంది. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, అది వెంటనే అధికారిక రికార్డుగా మారుతుంది. దీని వల్ల దర్యాప్తు నాణ్యత పెరగడమే కాకుండా, పోలీసు సేవలపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది” అని సీపీ వీసీ సజ్జనర్ తెలిపారు.

ఆధునిక పోలీసింగ్‌లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఇప్పటికే సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం ‘సి-మిత్ర’, సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ‘సాక్-ఐ’ వంటి ఏఐ ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాజా ‘ఏఐ కాప్‌రైట‌ర్’ యాప్‌తో ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతం కానుందని తెలిపారు.