బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Hyderabad

అత్తాపూర్ హత్య కేసు ఛేదన.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అత్తాపూర్ హత్య కేసు ఛేదన.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం హత్య కేసును అత్తాపూర్ పోలీసులు మరియు రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను గుర్తించగా, వారిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

లంగర్ హౌస్ మెహదీ కాలనీకి చెందిన మహమ్మద్ హుస్సేన్ (24) ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తుండేవాడు. ఈ నెల 9వ తేదీ రాత్రి పిల్లర్ నంబర్ 223 సమీపంలోని ఖుషీ ఫంక్షన్ హాల్ వద్ద నిందితులు అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో హుస్సేన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మే 10వ తేదీ తెల్లవారుజామున మరణించాడు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గంజాయి సరఫరా వ్యవహారమే హత్యకు కారణమని తేలింది. నిందితుడు గంజాయి కొనుగోలు కోసం హుస్సేన్‌కు రూ.700 అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు, అయితే గంజాయి సరఫరా చేయకపోవడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో మే 9వ తేదీ రాత్రి నిందితులు హుస్సేన్‌ను అడ్డగించి దాడి చేసి, అనంతరం మరో ప్రాంతానికి తరలించి మళ్లీ దాడి చేసినట్లు విచారణలో బయటపడింది. అనంతరం గాయపడిన హుస్సేన్‌ను ఏజీ కాలేజీ మెయిన్ గేట్ సమీపంలో పడవేసి నిందితులు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్

ఈ కేసులో కొంగళ్ల ప్రశాంత్, మిట్ట జగదీష్, రామ్ రోషన్ యాదవ్, గరుడ తరుణ్ కుమార్, ఆరుకల నిఖిల్, గుల్గులోత్ రాజ్ కుమార్, కపులూరి వెంగల్ రావు అలియాస్ వెంగ, మంకాల ప్రశాంత్ అలియాస్ సోను అరెస్టయ్యారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

నేరానికి ఉపయోగించిన ECO EV వాహనం, యాక్టివా స్కూటీ, ప్యాషన్ బైక్‌తో పాటు నిందితుల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేవలం ఒక్క రోజులోనే కేసును ఛేదించిన అత్తాపూర్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ బృందాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అభినందించినట్లు అధికారులు తెలిపారు.