హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) మరియు పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఒక డ్రగ్ విక్రేతతో పాటు ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ.1.40 లక్షల విలువైన 13.5 గ్రాముల MDMA మరియు 7 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 366/2026 కింద NDPS చట్టంలోని సెక్షన్లు 8(c) r/w 22(c), 20(b)(ii)(B), 27 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు ఠాకూర్ ఆర్. కేశవ్ రాజ్ సింగ్ (30) సికింద్రాబాద్‌కు చెందినవాడు. ఎంబీఏ పూర్తి చేసిన అతను రియల్ ఎస్టేట్ మరియు స్టాక్ మార్కెట్ రంగాల్లో పనిచేసేవాడు. విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి మాదకద్రవ్యాలకు బానిసైనట్లు పోలీసులు వెల్లడించారు.
మొదట తన అవసరాల కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన కేశవ్ రాజ్ సింగ్, అనంతరం సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో స్వయంగా డ్రగ్ విక్రేతగా మారినట్లు విచారణలో తేలింది. పబ్ సంస్కృతి, పార్టీ సర్కిల్స్ మరియు తన స్నేహితులనే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నగదు రూపంలో చెల్లింపులు తీసుకుంటూ, నేరుగా చేతి మార్పిడి ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలిపారు.
ఈ కేసులో అరెస్టు చేసిన వినియోగదారుల్లో రోహన్ విలియమ్స్ (సాఫ్ట్‌వేర్ ఉద్యోగి), ఆయుష్ గుప్తా (హ్యూమన్ రిసోర్స్ ఉద్యోగి), లక్కిరెడ్డి నిఖిల్ అనురాగ్ (AI ఇంజనీర్) ఉన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా డ్రగ్స్ బారిన పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే 8712661601 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఈ ఆపరేషన్‌లో HNEW ఇన్‌స్పెక్టర్ ఎస్. బాలస్వామి, పంజాగుట్ట ఎస్‌ఐ శివశంకర్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.
