Breaking News

సికింద్రాబాద్‌లో వెండి వ్యాపారులను మోసం చేసిన అంతరాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్

Hyderabad City Police పరిధిలోని సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ అధికారులు వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి వెండి, నగదు మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అవులమంద ప్రాంతానికి చెందిన హీరాలాల్ వర్మ గత 10 సంవత్సరాలుగా మహంకాళి స్ట్రీట్‌లో “శ్రీ జగదంబ ఇండస్ట్రీస్” పేరిట సిల్వర్ రిఫైనరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మార్చి 25, 2026న ఆయనకు పరిచయమైన కస్టమర్ రాజేష్ మరో వ్యక్తితో కలిసి సుమారు 10 కిలోల వెండి కడ్డీలను తీసుకొచ్చి మార్పిడి కోసం ఇచ్చాడు. “దుర్గా బులియన్ రిఫైనరీ” పేరిట ప్యూరిటీ సర్టిఫికేట్ చూపించడంతో, వాటిని పరీక్షించకుండా నమ్మిన బాధితుడు సుమారు ₹15 లక్షల విలువైన 6,350 గ్రాముల స్వచ్ఛమైన వెండిని వారికి ఇచ్చాడు. అయితే తరువాత పరీక్షించగా ఆ కడ్డీల్లో అసలు వెండి లేదని తేలింది.

దర్యాప్తులో ఇదే ముఠా మహంకాళి మరియు మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి సుమారు 12.5 కిలోల వెండిని కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మొదట నిజమైన వెండి ఇచ్చి వ్యాపారుల నమ్మకం పొందుతారు. తర్వాత నకిలీ వెండి కడ్డీలను నకిలీ సర్టిఫికేట్లతో చూపించి అసలైన వెండిని తీసుకుని పరారవుతారు. ఇదే విధంగా వారు Madhya Pradesh, Odisha, Delhi, Uttar Pradesh రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడ్డారు.

పద్మారావు నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదనం – ఇద్దరు నిందితులు అరెస్ట్

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు హృదయేష్ కుమార్ (ఆగ్రా) కాగా, సుశీల్ కుమార్ వర్మ, ప్రిన్స్ @ లడ్డూ సోని, రాజీవ్ జైన్, సోను కుష్వాహా ఇతరులు. వీరిని ఆగ్రా మరియు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పట్టుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై సికింద్రాబాద్‌కు తరలించారు. నిందితుల నుండి 8.4 కిలోల వెండి, ₹1.5 లక్షల నగదు మరియు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటికే మహంకాళి మరియు మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిపై గతంలో కూడా మోసం కేసు నమోదై ఉంది. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *