సైబర్ నేరల పై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సిఐ రవి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు మంగళవారం గార్ల మండల పోలీస్ పరిధిలోని పూమ్య తండా గ్రామంలో పోలీస్ జాగృతి కళాబృందం చే..గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించరు.
‘జాగృతి పోలీస్ కళా బృందం’ రాత్రి 7:10 గంటల నుండి రాత్రి 9:20 గంటల వరకు గ్రామంలో రోడ్డు ప్రమాదాలు, డయల్100, బాల్య వివాహాలు, సిసి కెమేరాలు, గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలపై మేజిక్ షో తదితర అంశాలపై పాటల ద్వార, సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తూ 1930 సైబర్ టోల్ నంబర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో గార్ల బయ్యారం CI రవి, Si రియాజ్ పాషా, ASI.నూరుదిన్, పోలీస్ కానిస్టేబుల్స్, కళాబృందం ఇంచార్జి సతీష్ కుమార్, తిరుపతి, పృథ్వి రాజ్, సుమన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

