ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా గుండె పోటు వస్తున్నాయి….
కల్తీ ఆహార లోపమా లేక ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడమా…తెలియడం లేదు….
డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని.
తెలంగాణ, మహబూబాబాద్ జిల్లా: సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో షాకింగ్ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచర్ల శివారు సపావట్ తండాకు చెందిన సపావట్ రోజా (16)ఇంటర్ .. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వార్త తెలిసిన తల్లిదండ్రులు ఒక్క సరిగా శోక సంద్రం లో మునిగిపోయారు.