
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వర్రావు పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వరరావు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సోమేశ్వరరావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. హెడ్ కానిస్టేబుల్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.