బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Telangana

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేషనల్ హైవే పై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు – డ్రోన్ పర్యవేక్షణతో ప్రత్యేక నిఘా

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేషనల్ హైవే పై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు – డ్రోన్ పర్యవేక్షణతో ప్రత్యేక నిఘా

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేషనల్ హైవే పై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు – డ్రోన్ పర్యవేక్షణతో ప్రత్యేక నిఘా

— జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, పర్యాటకుల రాకపోకలతో నేషనల్ హైవే రహదారులపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంతరాలు కలగకుండా జిల్లా పోలీస్ శాఖ సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.

జిల్లా పరిధిలోని నేషనల్ హైవే వెంబడి ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు అదనపు ట్రాఫిక్ పోలీసులు, క్యూఆర్‌టీ బృందాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలను మోహరించామని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, జంక్షన్లు, టోల్ ప్లాజాలు, ధాబాలు, హోటళ్ల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
నేషనల్ హైవే పై ట్రాఫిక్ పరిస్థితిని రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. డ్రోన్‌ల ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడికి వెంటనే ట్రాఫిక్ సిబ్బందిని పంపి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ పార్కింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్డుపై వాహనాలు నిలిపివేయడం వంటి ఉల్లంఘనలను డ్రోన్ పర్యవేక్షణ ద్వారా గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

భారీ వాహనాల రాకపోకలను సమయానుసారం నియంత్రించడం, అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడం, వాహనాలు చెడిపోతే వెంటనే రోడ్డుపై నుంచి తొలగించేందుకు క్రేన్‌లు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు, అతివేగంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
“సంక్రాంతి పండుగను ప్రజలు సుఖశాంతులతో, సురక్షితంగా జరుపుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ సిబ్బందికి సహకరించాలి. అలా చేస్తే నేషనల్ హైవే పై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది” అని తెలిపారు.
ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ 100 నంబర్ సంప్రదించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.