బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Telangana

ఆదమరిస్తే అరనిమిషంలో గాయబ్…

ఆదమరిస్తే అరనిమిషంలో గాయబ్…

ఆదమరిస్తే అరనిమిషంలో గాయబ్

బస్సులలో బంగారు ఆభరణాలను దొంగలించే అంతరాష్ట్ర “థార్ గ్యాంగ్ “ ముఠా సభ్యుడిని అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానం తో అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు- జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్.

 15 రోజుల పాటు మధ్యప్రదేశ్ థార్ జిల్లాను జల్లెడపట్టి అంతరాష్ట్ర థార్ గ్యాంగ్ దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్ చేసిన నల్గొండ సి‌సి‌ఎస్ పోలీసులు .
 నిందితుడి వద్ద నుండి దొంగలించిన 85 లక్షల విలువగల “ఇంటాక్ట్ ప్రాపర్టీ” 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం .
 ముఠాలోని ఐదుగురు అలవాటు పడిన నేరస్తులు గతంలో ఆంద్రప్రదేశ్,మహారాష్ట్ర మద్యప్రదేశ్ రాష్ట్రం లలో నిందితులు .
 పరారీలో ఉన్నమిగితా నేరస్తులను కూడా అతి త్వరలో పట్టుకుంటాము – జిల్లా యస్పీ.

నాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
 Cr. No. 341/2025 of చిట్యాల పి‌ఎస్ కు సంబందించి చిట్యాల పోలీసు స్టేషన్ పరిధి లో NL 01 B2 2756 నెంబరు గల బస్సులో  భారీ మొత్తం లో బంగారు ఆభరణాల చోరీ జిల్లా లో సంచలనం సృస్టించినది. దీనిని సవాలుగా తీసుకున్న గౌరవ జిల్లా ఎస్పీ , హైవే ల వెంట ధాబాల వద్ద ఆగి ఉన్న బస్సులను లక్ష్యంగా చేసుకొని ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠాలను  అదుపులోనికి తీసుకొవాలని రెండు  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలు   సి‌సి‌ఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో కేసును ఛేదించటానికి వివిధ ప్రాంతాలలో పర్యటించి ఎటువంటి ఆధారాలు లభించని కేసును అత్యదునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇట్టి  నేరానికి పాల్పడినది మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లా కు చెందిన అలవాటుపడిన నేరాస్తులుగా గుర్తించినారు.  తదుపరి గౌరవ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ గారు ఇట్టి రెండు ప్రత్యేక బృందాలను మధ్యప్రదేశ్ రాష్ట్రనికి పంపడం జరిగినది .  ఇట్టి ప్రత్యేక బృందాలు 15 రోజుల పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో పర్యాటించి అత్యదునిక సాంకేతిక పరిజ్ఞానం  తో నేరస్తులపై ప్రతెక నిఘా ఉంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద ఒక నింది  తుదడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా, అతడు తన సహచరులు అష్రఫ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాబర్ ఖాన్, ఉమర్ ఖాన్లతో కలిసి పైన పేర్కొనబడిన నేరాన్ని చేసినట్టుగా అంగీకరించినాడు మరియు గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో హైవేలపై ప్రయాణించే బస్సులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. విచారణలో భాగంగా  గతంలో  కూడా ఇట్టి ముఠా 2022 మరియు 2023 సంవత్సరం లో కూడా విజయవాడ హైవే పై ఇవే ప్రదేశాలలో  హోటల్ ల  వద్ద ఆగి ఉన్న బస్సు నుండి భారీ మొత్తంలో డబ్బులను  మరియు బంగారు ఆభరణాలను  దొంగలించి నట్టు తెలిపినాడు. ఇట్టి నిడితుదిని మునవ్వర్ న్యాయస్థానం నందు హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ పై జిల్లాకు తీసుకోరవడం జరిగినది.

 నిందితుడి వద్దనుండి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలు  స్వాధీనం చేసుకోవడం  జరిగింది.  ఇట్టి ముఠా సభ్యులను గతంలో చేసిన పాతనేరాలను వెలికితీసి  సమగ్ర విచారణ కై  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం  జరిగినది.

పట్టుబడిన నేరస్థుని వివరాలు:
1.షా అల్లా రఖా,వయస్సు: 30 సంవత్సరాలు,వృత్తి: డ్రైవర్,నివాసం: ఖల్ఘాట్ గ్రామం, ధర్మపురి తాలూకా, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం.

ఇట్టి ముఠా సభ్యులను సి‌సి‌ఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి గారి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ,సి.సి.ఎస్ ఎస్ఐ శివ కుమార్, మరియు  సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్ వెంకటేష్, సాయికుమార్ , జూనేద్ , శివరాజు, మహేశ్, కమల్ కిశోర్. చిన్న బాబు  మరియు ఇతర సి‌సి‌ఎస్ సిబ్బందిని జిల్లా ఎప్.పి.  ప్రత్యేకంగా అభినందించి  రివార్డును ప్రకటించారు.