నల్గొండ జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ఆస్తి నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి అనేక కీలక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా పోలీసు అధికారి శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.
ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తు, సమర్థవంతమైన అభియోగాలే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని ఎస్పీ పేర్కొన్నారు.
నేరాల నియంత్రణ – గణనీయమైన తగ్గుదల
2024తో పోలిస్తే 2025లో నల్గొండ జిల్లాలో మొత్తం నేరాలు 8,834 నుండి 8,493కి తగ్గాయి.
తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని ఎస్పీ తెలిపారు.
ప్రత్యేకంగా లాభం కోసం జరిగే హత్యలు – సున్నా
దోపిడీలు – సున్నా
హత్యలు, అత్యాచారాలు, చోరీలు, మోసాలు వంటి ప్రధాన నేరాల్లో స్పష్టమైన తగ్గుదల నమోదైంది.
ఇది నివారణాత్మక పోలీసింగ్, గస్తీ, నిఘా చర్యలు సమర్థంగా అమలవుతున్నదానికి నిదర్శనమని ఎస్పీ తెలిపారు.

శిక్షల అమల్లో 103% వృద్ధి
నేరాల నియంత్రణతో పాటు న్యాయసేవల అందించడంలో జిల్లా పోలీసు శాఖ దృఢమైన కట్టుబాటుతో పనిచేస్తోందని పేర్కొన్నారు.2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు:
ఘోర నేరాల కేసుల్లో
రెండు మరణ శిక్షలు,జీవిత ఖైదు సహా మొత్తం 132 దోషసిద్ధులు సాధించారు.
2024తో పోలిస్తే శిక్షల శాతం 103% పెరిగింది.
ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల సమర్థ వినియోగం, ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం వల్ల నాణ్యమైన శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు.
ఆస్తి నేరాల్లో భారీ తగ్గుదల & గుర్తింపు శాతం పెరుగుదల
2025లో ఆస్తి నేరాల నియంత్రణలో జిల్లా పోలీసు శాఖ గణనీయమైన పురోగతి సాధించింది.
ఆస్తి నేరాల కేసులు
2024లో 700 → 2025లో 637
ఆస్తి నష్టం విలువ
₹15.17 కోట్లు → ₹5.28 కోట్లు
ఆస్తి రికవరీ
₹5.53 కోట్లు → ₹3.33 కోట్లు
ఆస్తి నేరాల గుర్తింపు శాతం
36.47% నుండి 63.08%కు పెరుగుదల
మొత్తం కేసుల గుర్తింపు శాతం
64.57% నుండి 69.07%కు పెరుగుదల
ఈ గణాంకాలు జిల్లా పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఎస్పీ తెలిపారు.
సైబర్ నేరాల నియంత్రణ
సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం:
2024లో ₹16.31 కోట్లు
2025లో ₹4.62 కోట్లు
అవగాహననే ప్రధాన ఆయుధంగా భావించి:
డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో D4C (District Cyber Crime Coordination Centre) ఏర్పాటు
VPO వ్యవస్థ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు
దీని వల్ల సైబర్ మోసాలపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ తెలిపారు.
లోక్ అదాలత్
లోక్ అదాలత్ ద్వారా 49,943 కేసులు పరిష్కరించబడ్డాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యం
నల్గొండ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ 24 గంటల నిరంతర పర్యవేక్షణ చేపడుతోందని ఎస్పీ తెలిపారు.
డ్రగ్ పెడ్లర్లు, సరఫరాదారులపై కఠిన చర్యలు
53 మందిని అరెస్ట్
304.756 కిలోల గంజాయి స్వాధీనం
వినియోగదారులను గుర్తించి, మనోవిజ్ఞాన నిపుణుల సహాయంతో తల్లిదండ్రులతో కలిసి కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రాజెక్ట్ ‘శుద్ధి’
బాలల దినోత్సవం–2025 సందర్భంగా ప్రారంభించిన “ప్రాజెక్ట్ శుద్ధి” ద్వారా:
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు
గంజాయి సహా మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన
చిన్న వయసులోనే “మత్తుమందుల రహిత జీవితం” వైపు యువతను ప్రోత్సహించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
రోడ్డు భద్రత – ప్రత్యేక చర్యలు
జాతీయ, రాష్ట్ర రహదారులపై క్రమం తప్పకుండా హైవే పేట్రోలింగ్
ప్రమాదాలు తరచుగా జరిగే 109 గ్రామాల గుర్తింపు
ఇప్పటివరకు 91 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు పూర్తి
కౌన్సెలింగ్ & శిక్షణ
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 4,832 మందికి కౌన్సెలింగ్
పాఠశాలలు, కళాశాలల్లో 420 మంది విద్యార్థులకు అవగాహన
బ్లాక్ స్పాట్లు
2024తో పోలిస్తే 2025లో 11 బ్లాక్ స్పాట్లు తగ్గింపు
ప్రస్తుతం మొత్తం 30 బ్లాక్ స్పాట్లు
ప్రత్యేక డ్రైవ్‌లు & నాకాబందీలు
MV Act కేసులు: 54,999 పెరుగుదల
జరిమానా వసూలు: ₹14,58,710 పెరుగుదల
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: 10,117 పెరుగుదల
డయల్–100 స్పందన
2024: 55,184 కాల్స్
2025: 53,203 కాల్స్
రెండు సంవత్సరాల్లోనూ 100% స్పందన
సగటు స్పందన సమయం: 4 నిమిషాలు 5 సెకన్లు
మహిళలు & పిల్లల భద్రత
షీ–టీమ్స్ ద్వారా అవగాహన, కౌన్సెలింగ్, అరెస్టులు
మహిళా భరోసా కేంద్రం ద్వారా బాధితులకు న్యాయం & పరిహారం
ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్ ద్వారా 205 మంది పిల్లల రక్షణ
యువ – తేజం
గ్రామీణ యువత సాధికారత లక్ష్యంగా:
జిల్లా వ్యాప్తంగా కబడ్డీ పోటీలు
05-04-2025 న మెగా జాబ్ మేళా
6,497 మంది నమోదు
3,300 మందికి ఉద్యోగాలు
తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్
సెప్టెంబర్ 2025లో:
రూ.8 లక్షల వ్యయంతో
తెలంగాణలోనే తొలి పోలీస్ క్రెచ్ నల్గొండలో ప్రారంభం
“SHE LEADS – Nalgonda Believes” కార్యక్రమంలో భాగం

మహిళా పోలీసులకు పూర్తి ఫీల్డ్ బాధ్యతలు
ఆగస్టు 2025 నుంచి:
రాత్రి పేట్రోలింగ్
వాహన తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్
నేరస్థల పరిశీలన
సైబర్ క్రైమ్ & పిటిషన్ విచారణల్లో మహిళా పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు.
పోలీస్ సిబ్బందికి మెగా మెడికల్ హెల్త్ క్యాంప్
సుమారు 2,000 మంది పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు
ఉచిత వైద్య పరీక్షలు, మందులు
అపోలో, రెనోవా, మెడికోవర్, IMA, GGH నల్గొండ వైద్యుల సహకారం.
దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు & చట్ట అవగాహన
చందంపేట మండలం పొలెపల్లి గ్రామంలో:
సుమారు 1,500 మంది లబ్ధి.
నల్గొండ జిల్లా పోలీసు – వార్షిక విజయాలు 2025
🔹 నల్గొండ జిల్లాలో నేరాలు తగ్గింపు – పోలీసు శాఖకు భారీ విజయం
🔹 2024తో పోలిస్తే 2025లో మొత్తం కేసులు తగ్గింపు
🔹 తీవ్రమైన నేరాలు 221 → 169కు తగ్గాయి
🔹 లాభం కోసం హత్యలు, దోపిడీలు – జీరో
హత్యలు : 35 → 24కు తగ్గింపు
అత్యాచారాలు : 101 → 87కు తగ్గాయి
మొత్తం చోరీలు : 468 → 420
మోసాలు : 657 → 579కు తగ్గింపు
🔹 శిక్షలు – చరిత్రాత్మక వృద్ధి
2025లో 132 కేసుల్లో శిక్షలు ఖరారు
గత ఏడాదితో పోలిస్తే 103% వృద్ధి
2 మరణ శిక్షలు, 11 జీవిత ఖైదులు
🔹 లోక్ అదాలత్ సూపర్ సక్సెస్
49,943 కేసులు పరిష్కారం
ఈ-పెట్టీ కేసులు : 29,143
ఎంవీ యాక్ట్ కేసులు : 17,626
🔹 ఆస్తి నేరాల్లో భారీ తగ్గుదల
కేసులు : 700 → 637
నష్టం : ₹15.17 కోట్లు → ₹5.28 కోట్లు
ఆస్తి గుర్తింపు శాతం : 63.08%
🔹 మహిళల భద్రత – ప్రత్యేక చర్యలు
షీ–టీమ్స్ ద్వారా 662 అవగాహన కార్యక్రమాలు
546 మందికి కౌన్సెలింగ్
423 రెడ్ హ్యాండెడ్ అరెస్టులు
POCSO కేసులు తగ్గింపు
🔹 సైబర్ నేరాలపై బ్రేక్
నష్టం : ₹16.31 కోట్లు → ₹4.62 కోట్లు
₹1.48 కోట్లు రిఫండ్
🔹 డ్రగ్స్‌పై ఉక్కుపాదం
53 NDPS కేసులు నమోదు
251 నిందితుల అరెస్టు
304.756 కిలోల గంజాయి స్వాధీనం
🔹 డయల్–100 సూపర్ రెస్పాన్స్
100% కాల్స్ అటెండ్
సగటు స్పందన సమయం : 4 నిమిషాలు 5 సెకన్లు
🔹 సామాజిక కార్యక్రమాలు
ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్ : 205 పిల్లల రక్షణ
యువ–తేజం జాబ్ మేళా : 3,300 యువతకు ఉద్యోగాలు
2,000 పోలీసులకు మెగా హెల్త్ క్యాంప్
🔹 గర్వకారణం – నల్గొండ
తెలంగాణలో తొలి పోలీసు క్రెచ్ ఏర్పాటు
మహిళా పోలీసులకు పూర్తి మద్దతు
👉 ప్రజల సహకారంతో నల్గొండను సురక్షిత, నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసు శాఖ లక్ష్యం.
