బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

• జిల్లాలో మహిళల, బాలికల రక్షణలో భరోసా – షీ-టీమ్స్..

• జిల్లాలో మహిళల, బాలికల రక్షణలో భరోసా – షీ-టీమ్స్..

• జిల్లాలో మహిళల, బాలికల రక్షణలో భరోసా – షీ-టీమ్స్..
• మహిళల భద్రతకు జిల్లా షీ-టీమ్స్, భరోసా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు..
• మౌనాన్ని వీడి నిర్భయంగా ఫిర్యాదు చేసినప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం షీ-టీమ్స్-మొర్గి మాడల్ స్కూల్ నందు, భరోసా టీం- పాలిటెక్నిక్ కళాశాల, శివంపేట నందు విద్యార్థులకు మహిళా భద్రత, ఈవ్-టేసింగ్, పోక్సో, అత్యాచార కేసుల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల భద్రతకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని, మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల లైంగిక వేధింపులు, ఈవ్-టీసింగ్ వంటి సమస్యల నుండి విముక్తి కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. షి టీం బృందాలు స్కూల్స్, కాలేజీలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ వంటి జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలను హాట్ స్పాట్లు గా ఎంచుకొని, నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుందని అన్నారు. భరోసా సిబ్బంది విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాక్ టచ్, యుక్త వయసులో చేసే పొరపాట్లు, వాటి వలన కలిగే అనార్ధల గురించి, పోక్సో అత్యాచార కేసులలో బాదితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాన కలిపించడం జరుగుతుంది అన్నారు.
మహిళలు, బాలికలు మౌనాన్ని వీడి, నిర్భయంగా ఫిర్యాదు చేసినప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మహిళలు ఎలాంటి వేదింపులకు గురైన వెంటనే జిల్లా షీ-టీం నెంబర్ 8712656772 కు కాల్ ద్వారా గాని వాట్స్ యాప్ ద్వారా గాని సమాచారం అందించాలని, పిర్యాది వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం