మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత…
ఏర్పాట్లుగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో 163 BNSS (144 సెక్షన్ ) అమలుపోలింగ్ నిర్వహణకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలలో వద్ద పటిష్ట భద్రత..విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు .ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకువాలి.ఎన్నికల విధులో ఉన్న సిబ్బంది అలసత్వం వహించవద్దు ..
—-మహబూబాబాద్ జిల్లా ఎస్పి డా.శబరీష్..

మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్, కురవి, సీరోల్, మరిపెడ, గంగారం, కొత్తగూడ మండలాలలో మూడవ విడత గ్రామ పంంచాయితీ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా (05) డిఎస్పీలు, (15)సీఐలు, (50) మంది ఎస్.ఐలు సుమారు 1000సిబ్బందితో పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా డా. శబరీష్ తెలిపారు.
ప్రతి మండలానికి ఒక డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో రూట్ లుగా విభజించి ఎలాంటి సమస్యలు తలెత్తిన తక్షణమే అక్కడికి చేరుకునుని పరిష్కరించుటకు సీఐ,ఎస్.ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి,నిఘా కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన,రౌడీ షీటర్లు, ట్రబుల్ మంగార్స్ ను బైండవర్ చేయడం జరిగిందని అన్నారు.

గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, అల్లర్లు సృష్టించిన ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారి పైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఒక్క సారి కేసులు నమోదు అయితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు.జిల్లా ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించకోవాలని ఎస్పీ సూచించారు.
ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమికూడరాదని అన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు.ఎలాంటి సమస్యలు ఉన్న డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులకు, ర్యాలీలకు అనుమతి లేదని బాణాసంచా కాల్చడం,డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహబూబాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు, మహబూబాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించనున్న మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా విస్తృత స్థాయిలో పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తూ, జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలైన గంగారం మరియు కొత్తగూడ మండలాలలో ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన బ్యాలెట్ బాక్సులను తరలించే వివిధ రవాణా మార్గాలను సమగ్రంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్ బృందాల సహకారంతో రోడ్ ఓపెనింగ్ పార్టీ (ROP) మరియు యాంటీ సబటేజ్ చెక్ విధులను విస్తృతంగా నిర్వహిస్తూ, అనుమానాస్పద వస్తువులు లేదా ప్రమాదకర పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అనే దానిపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఎన్నికల సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలింగ్ సామగ్రి సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు చేరేలా అన్ని విభాగాల సమన్వయంతో ఈ భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. అలాగే, ఎన్నికల ప్రక్రియ మొత్తం కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి, శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం గస్తీ మరియు పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు.
