బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

జీడిమెట్ల పూర్ణిమ ప్రైమరీ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన ఘటనపై కలకలం – వెంటనే స్పందించిన బాలల హక్కుల కమిషన్

జీడిమెట్ల పూర్ణిమ ప్రైమరీ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన ఘటనపై కలకలం – వెంటనే స్పందించిన బాలల హక్కుల కమిషన్

జీడిమెట్ల పూర్ణిమ ప్రైమరీ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన ఘటనపై కలకలం – వెంటనే స్పందించిన బాలల హక్కుల కమిషన్

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్ణిమ ప్రైమరీ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, చందన వెంటనే స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టారు.

చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న అధికారులు

సంఘటన అనంతరం కమిషన్ సభ్యులు హాస్పిటల్‌కు వెళ్లి చిన్నారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందంటూ హామీ ఇచ్చారు.

ప్రైమరీ స్కూల్ పరిశీలనలో షాకింగ్ అంశాలు

తరువాత వారు పూర్ణిమ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. అక్కడ పలు తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి:

పాఠశాలలో సీసీ కెమెరాలు లేవు

చిన్ని పిల్లలకు అవసరమైన సురక్షిత వాష్‌రూమ్ సదుపాయాలు దాదాపు లేవు

చిన్నారులను సంరక్షించడానికి కావాల్సిన సిబ్బంది సరిపడా లేకపోవడం

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం

ఉన్న ఆయమ్మల పర్యవేక్షణ కూడా సరిగా లేకపోవడం

ప్రైమరీ స్థాయి పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఏ భద్రతా వ్యవస్థలు లేకపోవడం

ఈ పరిస్థితులను గమనించిన సరిత, చందన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

SHOతో చర్చ – యాజమాన్యం, ఆయమ్మపై కఠిన చర్యలు
తరువాత కమిషన్ సభ్యులు జీడిమెట్ల SHOతో సమావేశమై ఘటనపై చర్చించారు. ఘటనకు కారణమైన ఆయమ్మపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, చిన్నారులను రక్షించడంలో విఫలమైందని గుర్తించి, వారిపై కూడా కఠిన చర్యలు తప్పదని స్పష్టం చేశారు.

సరిత హెచ్చరిస్తూ—
“ప్రైవేట్ ప్రైమరీ స్కూల్స్ చిన్న పిల్లల భద్రతపై నిర్లక్ష్యం చూపడం పరిపాటిగా మారింది. కానీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. పిల్లల భద్రత మా మొదటి ప్రాధాన్యం” అని అన్నారు.

అధికారుల హాజరు – సమగ్ర విచారణ మొదలు

ఈ పరిశీలనలో DEO, DCPU, CWC సభ్యులు, MEO, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్కూల్ నిర్వహణ, సిబ్బంది బాధ్యతలు, భద్రతా ప్రమాణాలు, చిన్నారుల రక్షణ చర్యలపై వివరాలు సేకరించారు.

స్థానికులు, తల్లిదండ్రులు కమిషన్ వేగవంతమైన స్పందనను అభినందిస్తూ, ఇలాంటి ఘటనలు తిరగరాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.