
జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ఉద్యోగులకు కుటుంబ సభ్యులకు మేఘా హెల్త్ క్యాంప్ .
సిబ్బంది ఆరోగ్యం పరిరక్షణ సంక్షేమం కొరకు జిల్లా ఎస్పి కృషి
- పోలీస్ అదికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి: జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
పోలీస్ అధికారులు,సిబ్బంది కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని,వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పి సంకల్పంతో అపోలో,రినోవా, మెడికవర్, మ్యాక్స్ విజన్ , రైన్బో చిల్డ్రన్,క్లౌ డెంటల్,ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జిజిహెచ్ నల్లగొండ హస్పటల్ డాక్టర్ల సహకారంతో ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయoలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ వైద్య శిబిరంలో అధికారులకు,సిబ్బందికి వారి కుటుంభం సభ్యులకు నిపుణులైన కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిషన్, ఆంకాలజీ,ఈయన్టీ, పల్మనాలజీ,దంత సంబంధిత వైద్యులతో సుమారు
2000 మంది సిబ్బందికి బిపి, షుగర్, ఈసీజీ, 2 డి.ఈకో, పి.ఎఫ్టి, బి.ఎండి డిజిటల్ ఎక్సరే లాంటి పరీక్షలు నిర్వహించి వైద్యులు తగు సూచనలు, సలహాలు అందించి కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ వారి సహకారం తో మందులు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి విది నిర్వహణలో ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం నిద్ర లేకపోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందనీ అన్నారు. ముఖ్యంగా సిబ్బంది విధులతో పాటు ఆరోగ్య దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటించాలనీ అన్నారు. ప్రతి రోజూ వ్యాయామం, నడక, యోగాలాంటివి రోజువారీ దిన చర్యలో బాగం చేసుకోవాలని అన్నారు. విధి నిర్వహణే కాకుండా సిబ్బంది వారి సంక్షేమం కొరకు ఉచిత హెల్త్ క్యాంపు లు నిరహిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం నిర్వహించిన మెడికల్ క్యాంపులో 8 మందికి గుండె సంబంధిత వ్యాదులు ఉన్నాయని గమనించి సరైన చికిత్స అందించి కాపాడడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని సూచించారు.

ఈ యొక్క హెల్త్ క్యాంపుకు సహకరించిన టి. సాయి కిరణ్ ఏజియం కార్పొరేట్ సర్వీసెస్ రెనోవా హాస్పటల్స్ హైద్రాబాద్ మరియు ఐ.ఏం.ఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రాజేష్ బొల్లం మెడికల్ అంకలాజిస్ట్ అండ్ ఎక్సక్యూటివ్ డైరెక్టర్,డాక్టర్ రవీంద్రనాథ్ సి.ఓ.ఓ రెనోవా హాస్పిటల్ తదితర వైద్యులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే రేపు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోనీ సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ రమేష్,ఎస్.బి డియస్పి మల్లారెడ్డి,నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, డాక్టర్ ఉదయభాస్కర్, సుదీర్, ఆర్థోపెటిక్, డాక్టర్ సాయి సందీప్ పాలమానాలాజిస్ట్, అంకలాజిస్ట్ డాక్టర్ సాయి, డాక్టర్ సుజాత గైనకాలగిస్ట్, డాక్టర్ డేవిడ్ ప్రిడియాట్రీషన్, ఐ.యం.ఎ ప్రసిడెంట్ డాక్టర్ రమేష్,డాక్టర్ పుల్లారావు,డ్రగ్ అండ్ కెమిస్ట్రీ ప్రెసిడెంట్ పరమాత్మ సిఐలు రాఘవరావు, మహా లక్ష్మయ్య,రాజశేఖర్ రెడ్డి,శ్రీను నాయక్, రఘువీరారెడ్డి,ఆర్ఐలు సంతోష్,శ్రీను, నరసింహ, ఎస్ఐలు, సైదులు, గోపాల్ రావు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.సిబ్బంది ఆరోగ్యం పరిరక్షణ సంక్షేమం కొరకు జిల్లా ఎస్పి కృషి

