బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అవగహన కలిగి ఉండాలి-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజు దేశ వ్యాప్తంగా అనేక మంది సైబర్ నేరగాళ్లు బారిన పడి మోసాలకు గురవుతున్నారనీ,వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్గిఉండమే ఉత్తమ మార్గం అని జిల్లా ఎస్పీ అన్నారు. సైబర్ జాగారుకత దివాస్ సందర్భంగా నల్లగొండ పట్టణం కేంద్రంలోని దీప్తి నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు, సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా సులభంగా మోసపోయేది సైబర్ నేరగాళ్ల ద్వారానే అని అన్నారు. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డబ్బులు పోయాక బాధపడటం కంటే అవగాహనా తో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చదువుకున్న విద్యార్దులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటే తన చుట్టూ పరిసరాల్లో ఉన్న ప్రజలకు,వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తద్వారా సైబర్ మోసాలు నిరోధించవచ్చునని,సైబర్ నేరగాళ్లు ప్రజలనూ మోసం చేస్తున్న విధానాన్ని కళాశాల విద్యార్థినులకు తెలియజేశారు. ప్రస్తుత కాలం లో జరుగుతున్న నేరాలు అయిన APK FILES whatsapp లో ఫార్వర్డ్ చేస్తున్నారు,ఈ apk file ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ కు గురి అయి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే జంప్డ్ డిపాజిట్ స్కీం, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ప్రౌడ్, సైబర్ బుల్లింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే బ్యాంక్ అదికారులు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరు అనే విషయాలను గుర్తించాలని,బ్యాంక్ వారు ఏలాంటి మెసేజ్ లు గాని, లింక్స్ పంపరని ఇట్టి విషయాలు గమనించి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, ఏమైన సందేహాలు ఉంటే బ్యాంక్ కు వెళ్లి నిర్ధారించుకోవాలి అని అన్నారు. గ్రూప్ లలో లేదా వ్యక్తిగత నెంబర్ లకు అపరిచిత వ్యక్తుల నుండి ఎస్ ఎమ్ ఎస్ ఈ మెయిల్స్ ద్వారా గాని, వాట్సాప్ ట్యీట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దనీ తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే స్పందించి 1930 కి సమాచారం అందించి NCRP portal (www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. తద్వారా పోయిన డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమoలో సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఎస్బీ సీఐ రాము,1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐ విష్ణు,మరియు కళాశాల విద్యార్థినులు తదితరులున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి