బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

స్టేషన్ అధికారి, సిబ్బంది పని తీరు బాగుంది – జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• వార్షిక తనిఖీలలో భాగంగా రాయికోడ్ పోలీసు స్టేషన్, హద్నూర్ సర్కిల్ కార్యాలయాలను ఇన్స్పెక్షన్ చేసిన జిల్లా ఎస్పి.
• స్టేషన్ పరిసరాల శుభ్రత, రికార్డ్స్ మెంటేనేన్స్ పరిశీలన.
వార్షిక తనిఖీలలో భాగంగా రాయికోడ్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్ ఐపిఎస్, రాయికోడ్ పోలీసుల వందనం స్వీకరించి, డిఎస్పీ తో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్ ను తనిఖీ చేస్తూ తగు సూచనలు చేయడం జరిగింది. స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇన్వెస్టిగేషన్ లో సందేహాలుంటే. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. నేరాలు జరిగిన ప్రాంతాలను స్టేషన్ పార్ట్-II మ్యాప్ లో నమోదు చేయాలని, ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను “క్రైమ్ హాట్ స్పాట్స్” గా గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు. స్టేషన్ పరిదిలో గల కేడి, సస్పెక్ట్, రౌడీ షీటర్ లను చెక్ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచి, తరుచూ తనిఖీ చేయాలని అన్నారు. ప్రభుత్వ నిషేదిత గంజాయి సాగు, రవాణ, ప్రభుత్వ పంపిణీ బియ్యం (పి.డి.ఎస్ రైస్) అక్రమ రవాణా జరగకుండా ముమ్మర వాహనాల తనిఖీ నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారి ఆయా గ్రామలపై పూర్తి అవగాహన కలిగి, ముందస్తూ సమాచారాన్ని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని అన్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థలలో, పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, డైల్ -100 కాల్స్ కు బ్ల్యూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది త్వరితగతిన స్పందించి, నేరాస్థలానికి చేరుకోవాలని, త్వరగా ఘటన స్థలానికి చేరుకోవడం వలన నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.స్వచ్ఛంధంగా సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని ఎస్.హెచ్.ఓ సూచించడం జరిగింది. స్టేషన్ రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు బాగుందని, ఎస్.హెచ్.ఓ చైతన్య కిరణ్, సిబ్బందిని ఎస్పి అభినందించారు. ఈ వార్షిక తనిఖీ లలో భాగంగా ఎస్పి వెంబడి జహీరాబాద్ డియస్పి సైదా నాయక్, ఇన్స్పెక్టర్ హన్మంతు లు ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి