Breaking News

డిజిటల్ మోసాలు పెరుగుతున్న సంఘటనలను పరిష్కరించేందుకు, RBI అధికారులు.

సైబర్ నేరాల పెరుగుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొవడంలో వేగంగా స్పందించటం అనేది అత్యంత అవసరం,” అని సీవీ ఆనంద్,డీజీ & CP- హైదరాబాద్, అన్నారు.
డిజిటల్ మోసాలు పెరుగుతున్న సంఘటనలను పరిష్కరించేందుకు, RBI అధికారులు, మరియు పోలీసులు మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సి. వి. ఆనంద్ బ్యాంకులు, మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మధ్య సమర్థవంతమైన సమన్వయం అవసరమని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ సైబర్ నేరాలను ఛేదించే సమయంలో ఎదురయ్యే ప్రధాన సవాళ్లను ఆయన వివరించారు. ముఖ్యంగా, బ్యాంకుల నుండి ఖాతా వివరాల వంటి కీలక సమాచారం పొందడంలో జాప్యాలు, దర్యాప్తు వేగం మరియు బాధితులపై ప్రభావం చూపుతున్నాయని ఆయన చెప్పారు. CP ఆనంద్ బ్యాంకింగ్ కంప్లెయిన్స్ లో ల్యాప్సెస్ ఉదాహరణకు నకిలీ కరెంటు అకౌంట్లు తెరవడం మరియు మ్యూల్ అకౌంట్ల వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. సైబర్ నేరగాళ్ల ఆధునిక తీరుతెన్నులు, అనేక ఖాతాల ద్వారా లేయరింగ్, షెల్ అకౌంట్ల వినియోగం, మరియు VPNల ద్వారా జరిపే లావాదేవీలు ట్రాకింగ్ ప్రక్రియను క్లిష్టతరం చేస్తున్నాయని వివరించారు. “దయచేసి దీనిని ఫిర్యాదుగా భావించకండి. ప్రజల ప్రయోజనాల కోసం మనం కలిసి పనిచేద్దాం,” అని ఆయన విజ్ఞప్తి చేశారు. మోసగాళ్ల ఖాతాల్లోకి నిధుల బదిలీని నిరోధించేందుకు వేగంగా స్పందించిన బ్యాంకు అధికారులను సిటి పోలీస్ అభినందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సైబర్ నేర విభాగం రూపొందించిన సిఫారసులను ఆయన మీటింగ్ లో ప్రస్తావించారు. అందులో జియో-బేస్డ్ అకౌంట్ వెరిఫికేషన్, రియల్-టైం మానిటరింగ్, మరియు మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రోటోకాల్స్ వంటి అంశాలు ఉన్నాయి. RBI ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పట్నాయక్ సవాళ్లను ప్రస్తావించి, వేగవంతమైన స్పందన, అవగాహన కార్యక్రమాలు, మరియు కమ్యూనికేషన్ ఛానళ్ల స్టాండర్డైజేషన్ దృష్టి పెట్టడం గురించి వివరించారు. డూప్లికేట్ ఫ్రీజ్ రిక్వెస్ట్‌ల నివారణ, పీరియాడిక్ రివ్యూ, బ్యాంకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మరియు అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ అధికారిని ఏర్పాటు చేయడం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. RBI జనరల్ మేనేజర్ రుచి అస్థానా, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై ప్రెసెంటేషన్ ఇచ్చారు. ప్రముఖ బ్యాంకుల న్యాయ సలహాదారులు మరియు RBI అధికారులు ముఖ్యమైన సూచనలు చేసారు.
నగర పోలీసుల చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రశంసించారు. ఈ ఆధునిక ఆర్థిక మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడాన్ని నిర్ధారించేందుకు, కోర్టు రిఫండ్ ఆర్డర్లు, ఖాతా స్టేట్‌మెంట్‌లలో జాప్యాలు లేదా KYC సంబంధిత సమస్యలపై బ్యాంకులకు ప్రతి నెల ప్యాండెన్సీ డేటాను పోలీస్ పంపించేలా నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకులు, వీటిని అత్యవసర ప్రాధాన్యంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి నెలలో బ్యాంకులు మరియు LEAs మధ్య సమన్వయ వర్క్‌షాప్‌లు నిర్వహించాలని, వాటిలో ప్రోసెస్ ఇంప్రూవ్మెంట్ చర్యలు, మోసపూర్వక తీరుతెన్నులపై అవగాహన, మరియు సమర్థవంతమైన సమన్వయంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కోర్టు రిఫండ్ ఆర్డర్లు మరియు ఖాతా పై మల్టిపుల్ హోల్డ్స్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) రూపకల్పన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్స్) కవిత, బిక్షం రెడ్డి, మరియు హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుల లీగల్ అడ్వైజర్స్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు . ఈ కమిటీ సమర్థవంతమైన మార్గదర్శకాలు,అమౌంట్ విడుదల మెకానిజంలు మరియు LEAs మరియు బ్యాంకుల మధ్య సమాచారం పంపక ప్రక్రియను సరళీకృతం చేసే ప్రామాణిక ఫార్మాట్‌లను రూపొందించేందుకు పని చేయనుంది. నగర పోలీస్ కమిషనర్, సైబర్ మోసాల ముప్పును ఎదుర్కోవడంలో అన్ని భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయానికి ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. సమావేశంలో చర్చించిన విషయాలు మరియు నిర్ణయాలు బాధితులకు న్యాయం అందించడంలో మరియు దర్యాప్తు వేగాన్ని పెంచుతాయని ఆయన ఆశ భావం వ్యక్తం చేసారు.

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *