Breaking News

మాదకద్రవ్యాల నిర్మూలనలో ఉన్నతాధికారులచే జిల్లాకు గుర్తింపు, రివార్డులతో సత్కారం..

మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీసు స్టేషన్ కు చెందిన ఆల్ప్రాజోలం కేసులో నిషేదిత ఆల్ప్రాజోలాన్ని తయారు చేస్తున్న ముఠాను పట్టుకొని, సుమారు రూ: 60 కోట్ల విలువగల ఆల్ప్రాజోలేతర ఆస్తులను గుర్తించినందుకు గాను సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖను తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్/డిజి సందీప్ శాండిల్యా ఐపియస్ అభినందించారు. ఈ కేసు చేధనలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు రివార్డులను అందించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో మునుముందు మరిన్ని మంచి ఫలితాలు రాబట్టి డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు.

విపరీతంగా పెరిగిన డైల్ -100 కాల్స్ ద్వారా, ట్యాబ్ ల టెక్నికల్ సమస్యల వలన ఎదుర్కొంటున్న సమస్యను అదిగమించడానికి, డైల్ -100 కాల్స్ కు త్వరితగతిన స్పందించడానికి గాను అన్నీ పెట్రో కార్ లకు, ప్రధాన పోలీసు స్టేషన్ లకు 20- నూతన ట్యాబ్ లను అందించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను నిర్వహించడానికి 10-బ్రీత్ అనలైజర్ కిట్లను, మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి నాన్-కాంటాక్ట్ గా ఫైన్ విధించడానికి గాను 5-హాండి కెమెరాలను అందించడం జరిగిందన్నారు.

అనంతరం క్రైమ్ రివ్యులో భాగంగా పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆస్తి సంభందిత నేరాలకు సంబంధించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. ఇన్స్పెక్టవర్స్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసుకొని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న యన్.బి.డబ్ల్యూస్, మిస్సింగ్ కేసులను ఛేదించాలన్నారు. యన్.డి.పి.యస్. కేసులలో నేరస్తులపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలని, వాణిజ్య పరంగా 20 కిలోల బరువు కలిగిన గంజాయిని అక్రమ రవాణా చేసిన గంజాయి స్మగ్లర్ల ఆస్తులను కోర్టుకు అటాచ్ చేయాలని, అలవాటు పడిన నేరస్తులపై పిట్ యన్.డి.పి.యస్ యాక్ట్ కు సిఫార్సు చేయాలన్నారు.

డ్రగ్ దుర్వినియోగం, ఆన్లైన్ మోసాల గురించి జిల్లా ప్రజలలో, విద్యాసంస్థలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతులు ఎవరైన గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలవాటు పడిన నేరస్తులపై పిడి యాక్ట్ నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే 1930 లేదా యన్.సి.ఆర్.బి. పోర్టల్ నందు నమోదు చేయాలని అన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలిగించే విధంగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలున్నట్లయితే నేషనల్ హైవే అథారిటీకి లేక రాయలని అన్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్, సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డియస్పి రామ్ మోహన్ రెడ్డి, నారాయణ ఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ డియస్పి వేణు గోపాల్ రెడ్డి, యస్.బి. ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *