బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిత తనిఖీ – జిల్లా ఎస్పీ.

దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతులు, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, స్టేషన్ క్రైమ్ రికార్డ్,జనరల్ రికార్డ్స్ లు తనిఖీ చేసి మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా వారి పట్ల తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. అనంతరం అదిక వడ్డీ పేరుతో మోసపోయిన బాలాజీ నాయక్ బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలాజీ నాయక్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరిగింది. అదిక వడ్డీ పేరుతో మోసపోయిన బాదితుల కొరకు అడిషనల్ ఎస్పి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని బాలాజీ నాయక్ పైన అతని బినామీల పైన ఉన్న ఆస్తులను కోర్ట్ ద్వారా జప్తు చేసి బాధితులను న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం అని తెలిపారు. మోసపోయిన బాదితుల కొరకు సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని బాధితులు ఎవరైన ఉంటే తమ యొక్క పిర్యాదులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి పిర్యాదు చేస్తే పూర్తి విచారణ చేపట్టి కోర్టులో నివేదిక సమర్పిస్తామని తెలిపారు. బాధితులు ఎవరైనా తొందర పడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. ఎటువంటి సమాచారం ఉన్న పోలీస్ వారికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, అడిషనల్ ఎస్పి రమేష్, కొండమల్లపల్లి సీఐ నవీన్ కుమార్,గుడిపల్లి ఎస్సై నరసింహులు, మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి