Breaking News

నేర పూరిత హత్య మరియు పోక్సో చట్టం కేసులో నిందితులను అరెస్టు-డి‌.ఎస్‌.పి, నల్లగొండ.

నల్లగొండ పట్టణముకు సమీపములోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను నేరస్థుడు A-1: గడ్డం కృష్ణ తండ్రి శంకరయ్య, గత 3 నెలల క్రితం మైనర్ బాలిక యొక్క గ్రామములొ ట్రాక్టర్ డ్రైవరు గా పనిచేయుటకు వెళ్ళి ఆమెతో పరిచయము పెంచుకొని మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో దగ్గరై, ఇన్స్టాగ్రామ్ ద్వార చాట్ చేసేవాడు. ఉదయం 8 గంటల సమయములో మైనర్ బాలిక తన గ్రామం నుండి కాలేజీకి అదే ఊరికి చెందిన రెగ్యులర్ గా వెళ్ళే ఆటొ లో బయలుదేరి నల్లగొండ కు రాగా మైనర్ బాలికను DEO ఆఫీసు సమీపములో A-1 గడ్డం కృష్ణ బైక్ పై వచ్చి, తన బైక్ పై ఎక్కించుకొని వెళ్ళితే ఎవరైనా చూస్తారని తన స్నేహితుడైన A-2 బచ్చలకూరి మధు తండ్రి లేట్ యాదయ్య సహకారముతో అమ్మాయి ని A-2 మధు యొక్క ఆటొ లో ఎక్కించి షంషు నగర్, రోడ్ నెంబర్-8 లో గల A-2 కిరాయికి తీసుకున్న రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి A-2 ను పంపించి, తాను (A-1) బలహీనముగా ఉన్న మైనర్ బాలికను బలవంతముగా, శారీరకముగా కలిసినాడు. ఆ సమయములో బాలికకు తీవ్ర రక్త స్రావము అయి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయినది. అది చూసి వెంటనే A-1 రూమ్ కు తాళం వేసి పారిపోయి తనకు తెలిసిన వ్యక్తి కి సమాచారం ఇవ్వగా, అతను పోలీసులకు తెలియపరిచినాడు. తరువాత నిన్న సాయంత్రం నేరస్థుడు (A-1) పోలీసు స్టేషన్ లో తాను చేసిన నేరం ఒప్పుకొని లొంగిపోయినాడు. తరువాత A-2 ను కూడ అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేసి వారి వాహనములు, సెల్ ఫోన్ లు స్వాదీన పర్చుకోనైనది. ఇట్టి కేసులో శవపరీక్ష ను టీమ్ ఆప్ డాక్టర్ లచే చేయించనైనది. సాకేతిక పరిజ్ఞానం మరియు డాక్టర్ ల ఒపీనియన్ మేరకు పై ఇద్దరు నేరస్తులు A-1 మరియు A-2 లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తము కోర్ట్ కు హాజరు పర్చనైనది. ఇట్టి కేసును త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి నేరస్థుస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఇట్టి కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో వేగవంతముగా దర్యాప్తు చేసిన సి‌ఐ-2 టౌన్ ఎస్. రాఘవ రావు, సి‌ఐ-1 టౌన్ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ 2 టౌన్ వై. సైదులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవర్ ఐ‌పి‌ఎస్ అబినందించినారు. 01. ఒక ఆటొ (నెంబర్: TS-05–UD-4674),02. ఒక పల్సర్ మోటార్ సైకిల్ (నెంబర్: TS 05–FN-2280),03. రెండు సెల్ ఫోన్లు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *