Breaking News

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 13,814 కేసుల పరిష్కారం-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

  1. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న IPC కేసులు 699.
  2. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 5319.
  3. ఈ పెట్టి కేసులు 7796.
  4. సైబర్ క్రైమ్ 135 కేసులలో 54,08,392 రూపాయలు బాధితుల అకౌంట్ కి రిఫండ్ చేయడం జరిగింది.
    జాతీయ లోక్ అదాలత్ లో వివిధ రాజీ పడదగిన కేసులలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం, రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి నిన్న నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో జిల్లా పరిధిలో రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ లో 13,814 కేసులు పరిష్కరించడం జరిగిందని, కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని,కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ అభినందించారు.

రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు – జిల్లా ఎస్పి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *