
ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డిజిపి చారుసిన్హా ఐపిఎస్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక బృందం పోక్సో అత్యాచార కేసులలో భాదిత పిల్లలు, మహిళలకు వారి తల్లిదండ్రులకు చేయూతను అందించడానికి వారికి వృత్తి విద్యా కోర్సులు, అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఎస్పీ సర్దార్ సింగ్ మాట్లాడుతూ.భాదితులు నుండి ధరఖాస్తులను స్వీకరించి, వారి విజ్ఞప్తి మేరకు స్కిల్ నైపుణ్యాభివృద్ధి ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు విద్యా అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ప్రతినిధులకు భరోసా కేంద్రం పనితీరును, భాదిత మహిళలకు అందిస్తున్న మెడికల్, లీగల్ సేవలు, తక్షణ పరిహారం వంటి వివరాలను గురించి భరోసా ప్రోగ్రామ్ మేనేజర్ రేంజి జోసెఫ్ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ప్రతినిధులు, ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఎస్పీ సర్దార్ సింగ్, ముత్యాలు ఇన్స్పెక్టర్, భరోసా ప్రోగ్రామ్ మేనేజర్ రేంజి జోసెఫ్, భరోసా కో-ఆర్డినేటర్ దేవలక్ష్మి సిబ్బంది భాదిత మహిళల కుటుంబసభ్యులు తదితరులు ఉన్నారు.
