
తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్, డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళి అర్పించిన ఎఆర్ డిఎస్పీ నరేందర్
కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యానికి, తెలంగాణ ఉద్యమానికి అక్షరయోధులుగా నిలిచారని, ఆయన కవితా భావాలను తెలంగాణ యాసలో సులువుగా అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పేవారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాళోజీ. ఈయన తెలంగాణ ఉద్యమాలతో పాటు స్వాతంత్ర ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఆయన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మహనీయుడు కాళోజీ. తెలంగాణ భాష అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పి, కలం ఎత్తిన వ్యక్తి కాళోజీ, అందుకు తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవం గా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, ఆర్.ఐ రామారావ్, రాజశేఖర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.