Breaking News

సెప్టెంబర్ 13 న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – ఎస్పీ.

రాజీ మార్గమే రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు,కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీకి అవకాశం ఉంటుంది అన్నారు. కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాద్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. జాతీయ లోక్-అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని అవగాహన కల్పించాలని అన్నారు.

రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు – జిల్లా ఎస్పి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *