బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం

హైదరాబాద్ మహానగరంలో దాదాపు 48 గంటల పాటు అంగరంగ వైభవంగా సాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. నగర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గణేశ్ ఉత్సవాల నిమజ్జన ప్రక్రియ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయింది. నిమజ్జన ముగింపు సందర్భంగా శనివారం తెలంగాణ సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు వివరాలు వెల్లడించారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా మూడు నెలల ముందు నుంచే పకడ్బందీ కసరత్తు ప్రారంభించారని వివరించారు.

ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్‌ను పెద్ద సంఖ్యలో దాదాపు 30 లక్షల మంది, బాలాపూర్ గణేష్‌ను 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు.

ఈ మహాక్రతువు విజయవంతానికి సంపూర్ణంగా సహకరించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఉత్సవాల నిర్వహణలో గత రెండు నెలలుగా అద్భుతంగా పనిచేసిన జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ, టీజీఎస్పీడీసీఎల్, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఒకటే కమిషనరేట్ పరిధి కావడం, జోన్లు సైతం అనుసంధానమై ఉండటంతో శాఖల మధ్య సమన్వయం మెరుగై పర్యవేక్షణ ఎంతో సులువైందని చెప్పారు.

బందోబస్తు కోసం హైదరాబాద్ సిటీ పోలీస్‌కు చెందిన 20,000 మంది సిబ్బందితో పాటు జిల్లాల నుంచి దాదాపు 8,000 మందికి పైగా అదనపు సిబ్బందిని, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీజీఎస్‌పీ విభాగాల బలగాలను వినియోగించామని, అదనపు బలగాలను సమకూర్చిన రాష్ట్ర డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతిక్షణం సమాచారాన్ని అందిస్తూ, పోలీస్ శాఖ సూచనలను ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో పాటు ఖైరతాబాద్, బాలాపూర్ ఉత్సవ సమితులు సూచనలను పాటిస్తూ సకాలంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు సహకరించాయన్నారు.

టీజీఐసీసీసీ మల్టీ ఏజెన్సీ వార్ రూమ్‌లో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి సమస్యలను పరిష్కరించారని ప్రశంసించారు. అయితే, ఊరేగింపుల్లో పేపర్ షాట్స్ వాడటం వల్ల రోడ్లపై వ్యర్థాలు పేరుకుపోయి, వర్షం పడినప్పుడు ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఏర్పడుతోందని, వీటి వినియోగాన్ని నిషేధించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

అలాగే రోడ్లపై అన్నదాన వ్యర్థాలను వదిలేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అశ్లీల నృత్యాలు చేయడం వంటి అంశాల్లో నిర్వాహకులు, ప్రజలు స్వయం క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని, ఈ అనుభవాలతో రాబోయే 2027 గణేష్ ఉత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డీబ్రీఫింగ్ సమావేశం నిర్వహించి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తామని వివరించారు.

ఈ ప్రెస్ మీట్ లో అడిషనల్ సీపీ (క్రైమ్స్ & సిట్) శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్, అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్ ఐపీఎస్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) శ్రీ డి. జోయల్ డెవిస్ ఐపీఎస్, ఖైరతాబాద్ జోన్ డిసిపి శ్రీమతి కె. శిల్పావల్లి ఐపీఎస్, సికింద్రాబాద్ జోన్ డిసిపి శ్రీమతి రక్షిత కె. మూర్తి ఐపీఎస్, శ్రీమతి కాజల్ సింగ్ ఐపీఎస్, డిసిపి ట్రాఫిక్ శ్రీ అవినాష్ కుమార్ ఐపీఎస్, డిసిపి టాస్క్‌ఫోర్స్ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ మరియు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా, శుక్రవారం అర్ధరాత్రి, శనివారం తెల్లవారుజామున శోభాయాత్ర ప్రధాన మార్గాలైన ఎం.జె. మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ స్వయంగా ద్విచక్ర వాహనంపై కలియదిరిగారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం, అహోరాత్రులు విధుల్లో నిమగ్నమై అలసిపోయిన బందోబస్తు సిబ్బందిలో నూతనోత్సాహం నింపేలా వారితో కలిసి సీపీ సజ్జనర్ సరదాగా స్టెప్పులేసి సందడి చేశారు. పోలీస్ బాస్ తమతో కలిసి డ్యాన్స్ చేయడంతో సిబ్బంది ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.